మ‌హిళ‌ల‌కు ఇందిర‌మ్మ చీర‌లు.. ఈ ప్ర‌త్యేక చూశారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం తాజాగా మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేసే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది.;

Update: 2025-11-20 04:08 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం తాజాగా మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేసే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఇందిరా గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ ప‌థ‌కం కింద‌.. కోటి మంది మ‌హిళ‌ల‌కు రాష్ట్రంలో చీర‌ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. అయితే.. గ‌తంలో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం కూడా.. ఇలాంటి ప‌థ‌క‌మే అమ‌లు చేసింది. బ‌తుక‌మ్మ చీర‌ల పేరిట పేద‌ల‌కు చీర‌లు పంపిణీ చేసింది.

అయితే..అప్ప‌టికి.. ఇప్ప‌టికీ.. పెద్ద ఎత్తున మార్పు క‌నిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. గ‌తంలో నేరుగా చీర‌ల‌ను మ‌హిళ‌ల‌కు ఇచ్చేవారు. అంటే..ఎలాంటి క‌వ‌రింగ్ లేకుండా.. నేరుగా.. చీర‌లు మ‌హిళ‌ల చేతిలో పెట్టేవారు. దీంతో పెద్ద‌గా ఆక‌ర్ష‌ణ లేకుండానే ఈ ప‌థ‌కం అమ‌లైంది. అయితే..తాజాగా కాంగ్రెస్ స‌ర్కారు దీనికి కొన్ని హంగులు జోడించింది. మ‌హిళ‌ల‌కు ఇవ్వాల‌ని అనుకున్న చీర‌ల‌ను.. ప్ర‌త్యేకంగా రూపొంచిందించిన క‌వ‌ర్‌లో పెట్టి.. మ‌హిళ‌ల‌కు అందిస్తోంది. ఇవి చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. ఈ క‌వ‌ర్ల‌పై ఇందిరాగాంధీ బొమ్మ పెద్ద‌దిగా ముద్రించారు. దీనికి పైన సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను చిన్న‌దిగా ముద్రించారు. ఈ ప‌థ‌కానికి 'ఇందిరా మ‌హిళా శ‌క్తి' అనే పేరు పెట్టిన నేప‌థ్యంలో దీనిని కూడా క‌వ‌ర్‌పై పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో ముద్రించా రు. అంతేకాదు.. దీనికి కింద‌.. "మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క అక్కా-చెల్లెమ్మ‌ల‌కు రేవంత‌న్న కానుక‌" అని పేర్కొన్నారు. దీనికి కింద 'మ‌హిళా ఉన్న‌తి-తెలంగాణ ప్ర‌గ‌తి' అని ముద్రించారు. మొత్తంగా మ‌హిళ‌ల‌ను ఆక‌ర్షించేలా.. వారిని ఆకాశానికి ఎత్తేలా.. క‌వ‌ర్ల‌ను సైతం డిజైన్ చేశారు.

ఇక‌, సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు ప‌క్క‌న ప్ర‌భుత్వ రాజ‌ముద్ర‌, దీనికి ప‌క్క‌గా.. ముగ్గురు మంత్రుల ఫొటోల‌ను కూడా ముద్రించారు. ఇలా ఒక ప్ర‌త్యేక శైలిలో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డం.. గౌర‌వ‌ప్ర‌దంగా మ‌హిళ‌ల‌కు అందించ‌డం వంటివి అతివ‌ల మోముల్లో ఆనందం నింపుతున్నాయి.

Tags:    

Similar News