నిర్లక్ష్యానికి మూల్యం : ఇండిగోకు గట్టి షాకిచ్చిన కేంద్రం
నిర్లక్ష్యంతో బుకింగ్ లు ఓపెన్ చేసి చివరి నిమిషంలో రద్దు చేసి ప్రేక్షకులకు చుక్కలు చూపించిన ఇండిగోపై చర్యలకు కేంద్రం సిద్ధమైంది.;
నిర్లక్ష్యంతో బుకింగ్ లు ఓపెన్ చేసి చివరి నిమిషంలో రద్దు చేసి ప్రేక్షకులకు చుక్కలు చూపించిన ఇండిగోపై చర్యలకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఆ సంస్థను టైట్ చేయడం ప్రారంభించింది. పైలట్ల కొరత కారణంగా తలెత్తిన సమస్యలతో ఇండిగో విమాన సర్వీసులన రద్దు చేసింది. ఈనెలలో ఇప్పటివరకూ ఏకంగా 5000 పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలకు దిగిన డీజీసీఏ ఇండిగోకు షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది.
సమస్య తీవ్రత దృష్ట్యా ఫిబ్రవరి వరకూ రోజువారీ విమాన సర్వీసులను తగ్గించుకోవాల్సిందిగా డీజీసీఏ ఇండిగోను కోరినట్టు సమాచారం. గతంలో రోజుకు 2300 సర్వీసులను నడిపిన ఇండిగో, తాజా పరిస్థితల నేపథ్యంలో శీతాకాల షెడ్యూల్ కింద రోజకు 300 విమాన సర్వీసులన తగ్గించుకోమని డీజీసీఏ ఆదేశించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. శీతాకాల షెడ్యూల్ మార్చి చివరివరకూ నడవనుంది. ఫిబ్రవరి కల్లా 158 మంది అదనప పైలట్లన నియమించుకుంటామని ఇండిగో హామీ ఇచ్చినందున.. అప్పటివరకూ సర్వీసులు తగ్గించుకోవాలని డీజీసీఏ కోరనున్నట్ల సమాచారం.
ఒకవైపు ఇండిగో సర్వీసులను తగ్గిస్తే.. శీతాకాలంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. డిమాండ్ క అనుగుణంగా విమాన సర్వీసులన పెంచాల్సిందిగా ఎయిరిండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించ అవకాశం ఉందని తెలుస్తోంది.
సిబ్బంది కొరత, నిర్వహణపరమైన అంశాల కారణంగా భారీగా సర్వీసులు రద్దు అయిన నేపథ్యంలో ఇండిగో మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఆదాయపరంగా తీవ్రంగా నష్టపోతోంది. రద్దయిన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు టికెట్ల రీఫండ్ కింద రూ.610 కోట్లు జారీ చేస్తున్నట్లు సంస్థ ఆదివారం ప్రకటించింది.
రుణ రేటింగ్ సంస్థ మూడీస్ కూడా ఇండిగోకు రుణ రేటింగ్ ఇచ్చి ప్రతికూలమని ప్రకటించింది. పైలట్లను ముందుగానే నియమించుకోవడంలో ఇండిగో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని మూడీస్ విమర్శించింది. ఇండిగో సర్వీసుల రద్దుతో వేలమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న తరుణంలో వారికి ఊరట కల్పించేందుకు ఎయిరిండియా , ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ముందుకొచ్చాయి.
ఇక విమాన సర్వీసల రద్దు, భారీ రీఫండ్ ల ప్రకటనల నేపథ్యంలో ఇండిగో మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ పేరు బీఎస్ఈలో సోమవారం భారీగా నష్టపోయింది. షేరు ఏకంగా 8.28 శాతం నష్టపోయి రూ.4926.55 వద్ద ముగిసింది. గత 6 ట్రేడింగ్ రోజల్లో ఈ షేర్ 16.4 శాతం క్షీణించింది. దీంతో సంస్థ మార్కెట్ విలువ దాదాప రూ.37,000 కోట్ల మేర తగ్గింది.