భారతదేశ సోషల్ మీడియా గణాంకాలు ఇవే... ఎన్ని కోట్ల మందో తెలుసా..!

ప్రస్తుతం మనిషి దైనందిన జీవితంలో సోషల్ మీడియా ఓ భాగమైపోయిన సంగతి తెలిసిందే.;

Update: 2026-01-19 19:30 GMT

ప్రస్తుతం మనిషి దైనందిన జీవితంలో సోషల్ మీడియా ఓ భాగమైపోయిన సంగతి తెలిసిందే. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే క్షణం ముందు వరకూ కూడా సెల్ ఫోన్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. లైకులు, షేర్లు, కామెంట్లు చేసేవారికి కొదవలేదని అంటారు. ఈ క్రమంలో భారతదేశంలో ఏటా సోషల్ మీడియా యాక్టివ్ యూజర్ల సంఖ్య భారీ పెరుగుదలను నమోదు చేస్తుందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దామ్..!

అవును... భారతదేశ జనాభాలో దాదాపు 40% ప్రజలు సోషల్ మీడియాలో యాక్టివ్ యూజర్స్ గా ఉన్నారని అంటున్నారు. కెపియోస్ విశ్లేషణ ప్రకారం.. భారతదేశంలో సోషల్ మీడియా వినియోగదారులు 2024 ప్రారంభం, 2025 ప్రారంభం మధ్య 29 మిలియన్లు (+6.3 శాతం) పెరిగాయి. ఈ సమయంలో.. భారతదేశంలోని సోషల్ మీడియా వినియోగదారులలో 34.5 శాతం మంది మహిళలు కాగా.. 65.5 శాతం మంది పురుషులు ఉన్నారని నివేదిక చెబుతోంది.

ఈ క్రమంలో... 2025 ప్రారంభంలో భారతదేశంలో యూట్యూబ్ కు 491 మిలియన్ల వినియోగదారులు ఉన్నారని గూగుల్ యాడ్ సోర్సెస్ చూపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 500 మిలియన్లకు చేరిందని చెబుతున్నారు. ఈ సమయంలో.. యూట్యూబ్ ప్రకటనల పరిధి భారతదేశ మొత్తం జనాభాలో 33.7 శాతానికి సమానం అని కంపెనీ స్వంత డేటా సూచిస్తుంది!

ఇదే క్రమంలో... మెటా ప్రకటన సోర్స్ ప్రచురించబడిన డేటా ప్రకారం.. 2025 ప్రారంభంలో భారతదేశంలో ఫేస్‌ బుక్‌ కు 384 మిలియన్ల వినియోగదారులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 403 మిలియన్లకు పెరిగింది. అదేవిధంగా... భారతదేశంలో 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలలో 37.2 శాతం మంది ఫేస్‌ బుక్‌ ను ఉపయోగించారని కంపెనీ డేటా సూచిస్తుంది! ఇందులో 26.4 శాతం మంది మహిళలు కాగా.. 73.6 శాతం మంది పురుషులు!

మెటా ప్రకటన సాధనాలలో ప్రచురించబడిన డేటా ప్రకారం... 2025 ప్రారంభంలో భారతదేశంలో ఇన్‌ స్టాగ్రామ్‌ కు 414 మిలియన్ల వినియోగదారులు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 480 మిలియన్లకు పెరిగింది! ఈ క్రమంలో.. భారతదేశంలో 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలలో 37.6 శాతం మంది 2025 ప్రారంభంలో ఇన్‌ స్టాగ్రామ్‌ ను ఉపయోగించారు. ఇందులో 29.2 శాతం మంది మహిళలు కాగా, 70.8 శాతం మంది పురుషులు!

అదేవిధగా... 2025 ప్రారంభంలో భారతదేశంలో స్నాప్‌ చాట్‌ కు 208 మిలియన్ల వినియోగదారులు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 250 మిలియన్లకు పెరిగింది. అదేవిధంగా... 2025 ప్రారంభంలో భారతదేశంలో ఎక్స్ కి 24.1 మిలియన్ల వినియోగదారులు ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 30 మిలియన్లుగా ఉంది. ఇదే క్రమంలో అన్నింటికంటే అత్యధికంగా... భారతదేశంలో ప్రస్తుతం వాట్సప్ వినియోగదారులు 535 మిలియన్లుగా ఉండటం గమనార్హం!

Tags:    

Similar News