తరచూ ట్రైన్ జర్నీ చేస్తారా? అస్సలు మిస్ కావొద్దు

మీరు తరచూ రైల్వే ప్రయాణాలు చేస్తుంటారా? మిగిలిన జర్నీలు ఎన్ని ఉన్నా.. ట్రైన్ లో జర్నీ చేయటానికి ప్రయార్టీ ఇస్తారా? అయితే.. ఈ న్యూస్ మీ కోసమే.;

Update: 2025-06-30 08:00 GMT
తరచూ ట్రైన్ జర్నీ చేస్తారా? అస్సలు మిస్ కావొద్దు

మీరు తరచూ రైల్వే ప్రయాణాలు చేస్తుంటారా? మిగిలిన జర్నీలు ఎన్ని ఉన్నా.. ట్రైన్ లో జర్నీ చేయటానికి ప్రయార్టీ ఇస్తారా? అయితే.. ఈ న్యూస్ మీ కోసమే. అస్సలు మిస్ కావొద్దు. ఇప్పటివరకు రైలు ప్రయాణం చేసే వారికి తుది జాబితా నాలుగు గంటల ముందు మాత్రమే విడుదల చేయటం తెలిసిందే. అంతకంతకూ పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్లు రైల్వే శాఖ కొత్త రైళ్లను తీసుకురావటంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.

దీంతో..ట్రైన్ జర్నీ చేసే వారంతా కొత్త రైళ్లు లేక.. ఉన్న రైళ్లు అవసరాలు తీర్చలేకపోతున్నాయి. రూటు ఏదైనా.. ట్రైన్ లో ముందుగా రిజర్వు చేయించుకోవాలంటే వెయిటింగ్ లిస్టు అన్నది కామన్ గా మారింది. వెయిటింగ్ లిస్టు అయినా ఫర్లేదు.. తమ బుకింగ్ కన్ఫర్మ్ అవుతుందన్న ఆశతో ఉండటం..అది కాస్తా జరగకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఈ సమాచారాన్ని ట్రైన్ కదలటానికి 8 గంటల ముందు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

దీంతో. . వెయిటింగ్ లిస్టు కన్ఫర్మ్ కాకున్నా.. ప్రత్యామ్నాయాలు చూసుకునే వీలు ఉంటుంది. నాలుగు గంటల ముందే కన్ఫర్మేషన్ తెలియటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో.. ఇప్పటివరకు అమలు చేస్తున్న 4 గంటల ముందు కాస్తా 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ ను విడుదల చేస్తారు. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం కారణం.. టికెట్ కన్ఫర్మేషన్ మీద మరింత క్లారిటీతో పాటు.. ఒకవేళ వెయిటింగ్ లిస్టు క్లియర్ కాకున్నా.. వేరేలా ప్లాన్ చేసుకునే వీలు కలుగుతుంది. టికెట్ బుకింగ్ వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ చార్ట్ ను ట్రైన్ కదిలే సమయానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ ను డిసైడ్ చేయాలని నిర్ణయించారు.

Tags:    

Similar News