కూతుళ్లు నిద్ర లేవడం లేదని తల్లి ఏం చేసిందంటే..?

ఒక చిన్న పట్టణంలో జరిగిన ఈ ఫన్నీ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉదయం పొద్దెక్కుతోంది.. కానీ కూతుళ్లు ఇంకా చెద్దర్లలోనే ఉన్నారని ఈ తల్లికి ఒక కొత్త ఆలోచన వచ్చింది.;

Update: 2025-10-25 09:50 GMT

ప్రతి ఇంట్లో ఉదయం ఒక యుద్ధం లాంటిదే.. ముఖ్యంగా పిల్లలు స్కూల్‌కి, కాలేజీకి, లేదా ఆఫీస్‌కి వెళ్లాల్సినప్పుడు ‘లేవమ్మా.. పొద్దు పొడిచింది!’ అన్న తల్లి మాటలకే.. కూతుళ్లు విసుగుపడుతూ.. తల్లిని తిడుతూ భారంగా లేస్తారు. కానీ ఈ తల్లి మాత్రం అంత సులభంగా వదిలిపెట్టలేదు. కూతుళ్లు లేవకపోవడంతో ఏకంగా ‘బ్యాండ్‌’ను తెప్పించి వాయించి వారిని నిద్రలేపింది. సూటిగా చెప్పాలంటే ఇంట్లోనే సన్నాయి బృందం పిలిపించి, కూతుళ్లను నిద్రలేపింది!

చిన్న పట్టణంలో జరిగిన ఘటన..

ఒక చిన్న పట్టణంలో జరిగిన ఈ ఫన్నీ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉదయం పొద్దెక్కుతోంది.. కానీ కూతుళ్లు ఇంకా చెద్దర్లలోనే ఉన్నారని ఈ తల్లికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. డోలు, ట్రంపెట్‌ ను పిలిపించింది. ‘పా పా పా.. పం పం పం..’ అంటూ శబ్ధంతో క్షణాల్లో కూతుళ్లు ఉలిక్కిపడి మంచం మీద నుంచి లేచారు. ముఖాల్లో ఆశ్చర్యం, నవ్వు, చికాకుల కలయిక.. ‘ఏం జరుగుతోంది ఇక్కడ?’ అంటూ అరిచారు. ఆ ప్రశ్నకు తల్లి నవ్వుతూ, ‘ఇలా అయినా లేస్తావా ఇప్పుడు?’ అని సమాధానం చెప్పింది.

నెటిజన్ల స్పందన..

ఈ వీడియో వైరల్‌ అవగానే కామెంట్ల వర్షం మొదలైంది. ‘మదర్ ఆఫ్ ది ఇయర్!’ అంటూ తల్లిని ప్రశంసించగా, మరికొందరు ‘ఇలాంటివి చేయాలనే ధైర్యం ఉంటేనే పిల్లలు సరిగ్గా లేస్తారు!’ అని నవ్వేశారు. ఒకరు రాసిన కామెంట్‌ మరింత చమత్కారంగా ఉంది ‘మా ఇంట్లో అయితే సన్నాయి కాదు, డీజే పెట్టించాలి!’ అని. వీడియోలో కూతుళ్లు మొదట కోపంతో ఉన్నా, తర్వాత వాళ్లు కూడా నవ్వుతూ తల్లిని కౌగిలించుకున్నారు. అది ఒక్క క్షణం మాత్రమే అయినా, తల్లీ కూతుళ్ల మధ్య ఉన్న ఆ అల్లరి బంధం అందరికీ గుండెల్లో ముద్ర వేసింది.

ప్రేమతో నిండిన తల్లి పాఠం..

ఈ ఘటన కేవలం హాస్యమే కాదు.. ఒక సున్నితమైన సందేశం కూడా.. తల్లి ప్రేమ ఎంత వెరైటీగా వ్యక్తం అవుతుందో ఈ వీడియో చూపించింది. కోపం కాదు.. బోధ కాదు, హాస్యం ద్వారా కూడా ప్రేమను వ్యక్తం చేయవచ్చు అంటూ కొందరు అంటున్నారు. ప్రతి తల్లి తన పిల్లలను నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది, కానీ ఈ అమ్మ మాత్రం ఆ క్షణాన్ని నవ్వులతో నింపింది.

సోషల్ మీడియాలో దూసుకెళ్లిన ‘మదర్ మెలడీ’

ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ లలో ఈ వీడియోకి మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఒక ప్రముఖ యూజర్‌ ‘ది ఈజ్ ద ప్యూర్ ఇండియన్ మామ్ ఎనర్జీ’ అంటూ రాశాడు. విదేశీ యూజర్లు కూడా స్పందిస్తూ, ‘ఇది మదర్‌ ఇన్‌ ఇండియా లెవెల్‌!’ అంటూ నవ్వుల వర్షం కురిపించారు.



Tags:    

Similar News