ఫోర్బ్స్ 2025 జాబితాలో 12 మంది భారత సంతతి బిలియనీర్లు!
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా ఇప్పుడు భారతీయులే అగ్రపథాన ఉంటున్నారు. ఆయా సంస్థలను ముందుండి నడిపిస్తున్నారు.;
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా ఇప్పుడు భారతీయులే అగ్రపథాన ఉంటున్నారు. ఆయా సంస్థలను ముందుండి నడిపిస్తున్నారు. భారతీయుల ప్రతిభకు ప్రపంచమే దాసోహమవుతోంది. అగ్ర కంపెనీలు భారతీయులే నడిపిస్తున్నారు. భారతీయ ప్రతిభకు ప్రపంచమే దాసోహమవుతున్న పరిస్థితి నెలకొంది. ఆ పత్రిభ మన భారతీయులను బిలియనీర్లుగా చేస్తోంది. ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కిస్తోంది. మనల్ని గర్వపడేలా చేస్తోంది.
ఇది భారతదేశానికి ఎంతో గర్వకారణమైన సందర్భం. ఫోర్బ్స్ 2025 సంవత్సరానికి గాను విడుదల చేసిన "అమెరికాలో అత్యంత సంపన్న ప్రవాసులు" జాబితాలో ఏకంగా 12 మంది భారతీయ మూలం వ్యక్తులు చోటు దక్కించుకున్నారు. ఈ విజయం భారతీయ ప్రతిభ, దృఢ సంకల్పం, విజన్ , వినూత్నతకు నిదర్శనం. వీరంతా అమెరికాలో అత్యున్నత స్థాయికి ఎదిగి, తమ కార్యకలాపాలతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు.
ఈ బిలియనీర్లు కేవలం సంపన్నులు మాత్రమే కాదు, వీరు లక్షలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించారు. సరికొత్త ఆవిష్కరణలకు మార్గదర్శకులయ్యారు. భారతీయ మేధస్సును ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత వీరిది. వీరి విజయగాథలు విద్య, పట్టుదల , ప్రవాసుల అపారమైన సామర్థ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.
- ఫోర్బ్స్ 2025 జాబితాలో చోటు దక్కించుకున్న 12 మంది భారతీయ మూలం బిలియనీర్లు వీరే..
1. సుందర్ పిచై – CEO, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ)
2. సత్య నాదెళ్ల – CEO, మైక్రోసాఫ్ట్
3. జయ్ చౌధరి – CEO, Zscaler
4. రోమేశ్ వాధ్వానీ – చైర్మన్, SymphonyAI
5. వినోద్ ఖోస్లా – కో-ఫౌండర్, సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుడు, ఖోస్లా వెంచర్స్
6. కవితార్క్ రామ్ శ్రీరామ్ – గూగుల్‌లో ప్రాథమిక పెట్టుబడిదారు
7. జయశ్రీ ఉల్లాల్ – CEO, అరిస్టా నెట్‌వర్క్స్
8. బ్రయన్ శేథ్ – కో-ఫౌండర్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్
9.అనీల్ భుస్రి – కో-ఫౌండర్, వర్క్‌డే
10. నీర్జా సేథి – కో-ఫౌండర్, సింటెల్
11. థామస్ కురియన్ – CEO, గూగుల్ క్లౌడ్
12. నికేష్ అరోరా – CEO, పాలో ఆల్టో నెట్‌వర్క్స్
- భారతీయుల ప్రతిభకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు
ఈ వ్యక్తుల విజయాలు ప్రపంచ స్థాయిలో ప్రవాస భారతీయుల అసాధారణ సామర్థ్యాన్ని రుజువు చేస్తున్నాయి. వీరు తాము స్థిరపడిన దేశాల్లో నూతన ఆవిష్కరణలతో పాటు వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ సామాజిక మార్పునకు దోహదపడుతున్నారు.
ఈ జాబితాలో చోటు దక్కిన ప్రతి ఒక్కరూ విద్యను ఆయుధంగా, కలలను దిశగా, కృషిని మంత్రంగా మార్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ స్ఫూర్తిదాయకం.
వారి ప్రతిభను అభినందిస్తూ, భారతీయుల గొప్పతనాన్ని చాటిన ఈ విజయానికి మన దేశ ప్రజలందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుదాం.