నైట్ 9 టు మిడ్ నైట్... సె*క్సువల్ వెల్నెస్ అమ్మకాల పెరుగుదల ఏ రేంజ్ లో అంటే..!
భారతదేశంలో ఇప్పుడు నిత్యావసర వస్తువుల కోసం ఆన్ లైన్ మార్కెట్ ను ఆశ్రయిచే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుందని అంటున్నారు.;
భారతదేశంలో ఇప్పుడు నిత్యావసర వస్తువుల కోసం ఆన్ లైన్ మార్కెట్ ను ఆశ్రయిచే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుందని అంటున్నారు. అయితే ఇందులో ఉప్పులు, పప్పులు, దుస్తులు, చెప్పులు వంటివే కాదు సుమా.. ఒకప్పుడు కొనడానికి లేదా చర్చించడానికి ఇబ్బంది పడిన లైంగిక ఉత్పత్తుల అమ్మకాలు సైతం భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయి.
అవును... దేశంలో సెక్యు*వల్ వెల్నెస్ కొనుగోళ్లకు క్విక్ కామర్స్ ఫ్లాట్ ఫామ్ లు గణనీయమైన పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఈ పెరుగుదల ఏ స్థాయిలో ఉంది అంటే.. సంప్రదాయ ఫార్మసీలను మించిపోయి! ఇందులో భాగంగా... క్లీనికల్ రీసెర్చ్ సంస్థ ఐక్యూవీఐఏ డేటా ప్రకారం.. ఆన్ లైన్ డెలివరీ యాప్ లలో వీటి అమ్మకాలు జనవరి - నవంబర్ 2025 మధ్య 40% వరకు పెరిగాయి.
ఈ సమయంలో.. స్థానిక మెడికల్ స్టోర్ లలోని సాధారణ వాణిజ్యం కంటే ఇది సుమారు 22% వృద్ధిని నమోదు చేసిందని చెబుతున్నారు! ఈ ట్రెండ్ అనేది సున్నితమైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఇష్టపడే విధానంలో భారతీయుల్లో ప్రధాన మార్పును సూచిస్తుందని చెప్పొచ్చు. ఈ ఫ్లాట్ ఫామ్ లు ప్రధానంగా కండోమ్ లు, లూబ్రికెంట్లు, క్రీమ్మ్ లకు బలమైన డిమాండ్ ను నమోదు చేసినట్లు చెబుతున్నారు.
పైగా.. ఈ పెరుగుదలలో ఎక్కువభాగం స్పీడ్ డెలివరీల ఆకర్షణతో ముడిపడి ఉందని అంటున్నారు. ఈ వేగం ఫలితంగా తరచుగా రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య కొనుగోళ్లకు సరిపోతుందని అంటున్నారు. ఇదే సమయంలో.. ఇప్పటికీ మన సమాజంలో రిటైల్ స్టోర్స్ నుంచి లైంగిక వెల్నెస్ ఉత్పత్తులను కొనుగోలూ చేసేందుకు చాలామంది వినియోగదారులు సంకోచించడమూ ఒక కారణం అని చెబుతున్నారు.
ఈ క్రమంలో... ఒక నివేదిక ప్రకారం ఇన్ స్టామార్ట్ లోని ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ను కలిగి ఉంది! దీంతో.. ఈ పరిశ్రమంలో ఈ ఊపు మరింతగా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో లైంగిక వెల్నెస్ మార్కెట్ బలమైన విస్తరణకు సిద్ధంగా ఉందని పరిశోధనలూ సూచిస్తున్నాయి.