ఇకపై ఇండియాలో ఇంద్రధనస్సు చూడలేమా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి!

వర్షం పడి ఆగిపోయాక చాలా ప్రదేశాలలో ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపిస్తుంది. ఈ ఇంద్రధనుస్సు చూస్తే చాలా మంది చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా ఆనందంగా ఫీల్ అవుతారు.;

Update: 2025-08-23 11:30 GMT

వర్షం పడి ఆగిపోయాక చాలా ప్రదేశాలలో ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపిస్తుంది. ఈ ఇంద్రధనుస్సు చూస్తే చాలా మంది చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా ఆనందంగా ఫీల్ అవుతారు. అంతేకాదు ఇంద్రధనస్సుని చూసి మైమరిచిపోతూ ఉంటారు. అయితే అలాంటి ఇంద్రధనస్సు మన భారతదేశంలో ఇకపై కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో భారత దేశంలో ఇంద్రధనస్సు కనుమరుగవుతుందని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో తెలియజేయడంతో ఈ విషయం తెలిసిన చాలామంది షాక్ అయిపోతున్నారు. మరి ఇంతకీ భవిష్యత్తులో ఇంద్రధనస్సు కనుమరుగవడానికి కారణం ఏంటి? మానవ తప్పిదమా లేక మరేదైనా కారణమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వర్షం పడ్డ సమయంలో మేఘాలలోని నీటి ఆవిరి వర్షపు బిందువులుగా మారి సూర్యకాంతి ఆ బిందువుల నుండి ప్రసరించి, పరావర్తనం చెందినప్పుడు ఇంద్రధనస్సు కనిపిస్తుంది. ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉంటాయి. ఈ ఏడు రంగులు కూడా మనసుకి చాలా హాయిని కలిగిస్తాయి. అయితే అలాంటి ఇంద్రధనస్సుని ఇకపై భారత్ లో చూడలేమని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే భారతదేశంలోని అనేక నగరాల్లో ఇంద్రధనస్సు భవిష్యత్తులో కనుమరుగవబోతుందంటూ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం ద్వారా తెలియజేశారు.అయితే దీనికి కారణం వాతావరణంలో మార్పులు..పట్టణీకరణ, పెరుగుతున్న కాలుష్యం వలన వాతావరణంలో అనేక మార్పులు సంభవించడంతో ఇంద్రధనస్సు ఏర్పడే పరిస్థితులు చాలా వరకు తగ్గిపోతాయట.ఈ విషయాన్ని తాజాగా కొంతమంది శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వర్షాలు పడ్డ తర్వాత వచ్చే ఇంద్రధనస్సులను తమ ఫోన్ కెమెరాలలో క్యాప్చర్ చేసి ఒక పెద్ద డేటా బేస్ తయారు చేసి శాస్త్రవేత్తలకు పంపించారట కొంతమంది. అయితే ఈ శాస్త్రవేత్తలకు వచ్చిన ఫోటోలు వేర్వేరు ఖండాల నుండి ఇంద్రధనస్సుని చిత్రీకరించిన వాళ్ళు పంపించారు.

అలా వేర్వేరు ఖండాల నుండి వచ్చిన ఇంద్రధనస్సులను పరిశీలించి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను అంచనా వేసి మరీ బయటపెట్టారు. అయితే ప్రస్తుతం ప్రపంచంలో సంవత్సరానికి 117 సార్లు ఇంద్రధనస్సు కనిపిస్తే రాబోవు రోజుల్లో మరిన్ని ఎక్కువసార్లు ఇంద్రధనస్సు కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే ఈ ఇంద్రధనస్సు ఏర్పడే విధానం అనేది అన్ని దేశాలలో ఒకేలాగా ఉండదు.కొన్ని దేశాలలో ఎక్కువసార్లు ఇంద్రధనస్సు కనిపిస్తే మరికొన్ని దేశాల్లో తక్కువసార్లు ఇంద్రధనస్సు కనిపిస్తుంది. ముఖ్యంగా భూమధ్య రేఖకు దూరంగా ఉండే దేశాలలో ఇంద్రధనస్సు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. అలా మన భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉంటుంది కాబట్టి భారతదేశంలోని కొన్ని నగరాల్లో భవిష్యత్తులో ఇంద్రధనస్సు కనుమరుగవబోతుందని శాస్త్రవేత్తలు తేల్చేశారు. కానీ భూమధ్యరేఖకు దూరంగా ఉండే అంటార్కిటికా ఖండంలో ఈ ఇంద్రధనస్సు ఎక్కువసార్లు కనిపిస్తుందని చెప్పారు.

మరి ఇప్పటికైనా మానవుడు పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ఉంటే ఈ ఇంద్రధనస్సును కనుమరుగయ్యే పరిస్థితులను కాస్తైనా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇంద్రధనస్సు భవిష్యత్తులో కనుమరుగవడానికి కారణం గత కొద్ది సంవత్సరాల నుండి మానవుడు చేస్తున్న తప్పిదాలే.. అడవుల నరికివేత, విపరీతమైన కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం వంటి వాటి వల్లే ఈ అనర్ధాలు జరుగుతున్నాయి.ఇప్పటినుండి అయినా అడవులను నరికి వేయకుండా సంరక్షించి, కాలుష్యం తగ్గించడం వల్ల ఈ ముప్పు నుండి కాస్తైనా బయటపడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

.

Tags:    

Similar News