రిజిస్టర్డు పోస్ట్ నిలిపివేయడంపై కేంద్రం క్లారిటీ!
అసలు విషయంలోకి వెళ్తే.. బ్రిటిష్ కాలం నుంచే అమలులో ఉన్న రిజిస్టర్డు పోస్టును తపాలా శాఖ నిలిపివేస్తోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.;
ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది కానీ పూర్వం నుండే తపాలా శాఖకు ఏ రేంజ్ లో ప్రాధాన్యత ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్న విషయం అయినా సరే ఉత్తరాల ద్వారానే విషయాన్ని అవతల వారికి చేరవేసేవారు. ముఖ్యంగా ఈ ఉత్తరాల కోసం పిల్లల్ని మొదలుకొని పెద్దల వరకు ఎంతో ఆసక్తి ఎదురు చూసేవాళ్ళు. ఆ ఉత్తరాలు ఇచ్చే సంతోషం ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఇవ్వవని చెప్పవచ్చు. ఇకపోతే ఈ తపాలా శాఖ మీద ఇప్పటికీ చాలామంది ఆధారపడిన విషయం తెలిసిందే . నిజానికి ఇప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ మొదలుకొని వివిధ కార్యకలాపాలలో కూడా తపాల శాఖ కీలక పాత్ర పోషిస్తుంది . అయితే ఇప్పుడు ఈ తపాలా శాఖ నుండి ఒక వార్త అటు కస్టమర్లలో కలవరం సృష్టించిన విషయం తెలిసిందే.
అసలు విషయంలోకి వెళ్తే.. బ్రిటిష్ కాలం నుంచే అమలులో ఉన్న రిజిస్టర్డు పోస్టును తపాలా శాఖ నిలిపివేస్తోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 2025 సెప్టెంబర్ 1 నుండి రిజిస్టర్డు పోస్ట్ ను నిలిపివేస్తున్నట్లు వార్తలు వైరల్ చేశారు.
ఇక కస్టమర్లలో ఆందోళన పెరిగిపోతున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా సెప్టెంబర్ 1 నుండి రిజిస్టర్డు పోస్ట్ ను నిలిపి వేస్తున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదు అని ఇలాంటి క్లెయిమ్ లతో కొందరు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ రిజిస్టర్డు పోస్ట్ ను నిలిపివేయడం లేదని, దీనిని స్పీడ్ పోస్ట్ లో విలీనం చేయబోతున్నామని స్పష్టం చేస్తూ.. పీబీఐ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. మునుపటిలాగే రిజిస్టర్డు పోస్టులను సంబంధిత వ్యక్తులు నేరుగా వచ్చి డెలివరీ చేస్తారని, రియల్ టైం ట్రాకింగ్, డెలివరీ రసీదు కూడా మునుపటిలాగే రిజిస్టర్డు పోస్టులను సంబంధిత వ్యక్తులు నేరుగా వచ్చి డెలివరీ చేస్తారని, రియల్ టైం ట్రాకింగ్ డెలివరీ రసీదు కూడా ఉంటాయని స్పష్టం చేసింది. రిజిస్టర్డు పోస్ట్ పై వస్తున్న అపోహలకు కేంద్రం ఒక్క పోస్టుతో చెక్ పెట్టింది అని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా రిజిస్టర్డు పోస్ట్ విధానాన్ని స్పీడు పోస్టులో విలీనం చేస్తూ తపాల శాఖ నిర్ణయం తీసుకోగా.. ఈ విధానం సెప్టెంబర్ 1 నుంచి దేశం మొత్తం అమలులోకి రానుంది అని తెలిపింది. వేగవంతమైన జీవితంలో గజిబిజి లైఫ్ స్టైల్ లో పరిస్థితులకు అనుగుణంగా, ప్రజలకు అత్యంత సులభమైన, వేగవంతమైన, మెరుగైన సేవలను అందించడానికి అటు ట్రాకింగ్ విధానాన్ని కూడా సులభతరం చేయడానికి ఇలా అన్ని అంశాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే లక్ష్యంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే తపాలా శాఖకు సంబంధించిన ఈ రిజిస్టర్డు పోస్ట్ అంశంపై వస్తున్న రూమర్లకు ఒక్క మాటతో కేంద్రం పులిస్టాప్ పెట్టిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలియడంతో అటు ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.