ఏపీకి పోస్టల్ శాఖ గుడ్ న్యూస్

పోలీస్ శాఖ ఏపీలోని ఏకంగా పదకొండు నగరాలకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రజల సదుపాయం కోసం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది.;

Update: 2026-02-24 12:42 GMT

పోలీస్ శాఖ ఏపీలోని ఏకంగా పదకొండు నగరాలకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రజల సదుపాయం కోసం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. స్పీడ్ పోస్ట్ సదుపాయం అన్నది ఈ రోజులలో అందరికీ అవసరం. దానికి ఏకంగా రోజుకి ఇరవై నాలుగు గంటలూ నిరంతరాయంగా అందచేస్తోంది. ఆ విధంగా భారత తపాలా శాఖ ప్రజలకు సౌకర్యం కలిగిస్తూ రాష్ట్రంలోని 11 ముఖ్య నగరాలలో 24×7 స్పీడ్ పోస్ట్ మరియు పార్సెల్ బుకింగ్ సౌకర్యాలను ప్రారంభించింది.

ఈ సిటీలలో స్పీడ్ పోస్టు :

ఇదిలా ఉంటే ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, . కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, కడప, అనంతపురం, ఒంగోలు, గుంతకల్లు స్పీడ్ పోస్టు సదుపాయాన్ని పోస్టల్ శాఖ అందచేస్తఒంది. ఇక ఈ చెప్పిన 11 నగరాలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర 242 ప్రధాన పట్టణ తపాలా కార్యాలయాలలో కూడా ప్రజల సౌకర్యార్థం సాధారణ పని వేళలను 1 నుండి 2 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల కస్టమర్ల రద్దీ తగ్గడమే కాకుందా సేవల నాణ్యత మరింత మెరుగుపడనుందని అధికారులు చెబుతున్నారు.

మారుతున్న కాలానికి :

ఈ రోజుల కాలం వేగంగా పరిగెడుతోంది. ప్రజలు పూర్వం మాదిరిగా పోస్టల్ సేవల మీదనే ఆధారపడడం లేదు, ఇతర సేవలు ప్రైవేట్ రంగంలో విస్తరించి ఉన్నాయి. అందులో కొరియర్ సేవలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా కాలానికి తగినట్లుగా తనను తాను మార్చుకుంటోంది. ప్రజలకు చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే స్పీడ్ పోస్టులను సరికొత్తగా ప్రజలకు పూర్తిగా కనెక్ట్ అయ్యేలా తీసుకుని వస్తోంది. ఈ విధంగా కేవలం ప్రజలు మాత్రమే కాకుండా వ్యాపార సంస్థలకు ఉపయోగకరంగా తనను తాను మార్చుకుంటూ అందుబాటులోకి వేగవంతమైన సేవలను తెస్తోంది. ఆ విధంగా చూస్తే ఈ 11 నగరాలలో అందుబాటులో ఉన్న 24×7 బుకింగ్ సౌకర్యాలను అలాగే ఏపీలో ఉన్న ఇతర 242 తపాలా కార్యాలయాలలో పొడిగించిన పని వేళలతో పోస్టల్ శాఖ ప్రజలను ఇంకా ఎక్కువగా ఆకట్టుకోవాలని చూస్తోంది.

Tags:    

Similar News