'సర్ధార్ డొనాల్డ్ సింగ్ ట్రంప్'... ప్రకాశ్ రాజ్ ఉమ్మడి సెటైర్లు పీక్స్!

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన ప్రకాశ్ రాజ్... సర్ధార్ డొనాల్డ్ సింగ్ ట్రంప్, సర్పంచ్ ఆఫ్ అమిక్రా కలాన్ అంటూ ఆయనకు తలపాగా చుట్టి, మీసం పెట్టిన (ఏఐ!) పిక్ షేర్ చేశారు.;

Update: 2025-05-11 05:29 GMT

భారత్ - పాక్ మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాలు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు ప్రకటించాయి. ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. ఈ నెల 12న దీనిపై ఇరు దేశాల అత్యున్నత సమావేశం జరుగుతుందని తెలిపాయి.

అయితే.. అంతకంటే ముందు సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్.. అమెరికా మధ్యవర్తిత్వలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయని.. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారతదేశం, పాకిస్థాన్ అంగీకరించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు!

అవును... భారత్ – పాక్ మధ్య యుద్ధ వాతావరణం వేడేక్కిన వేళ దాదాపు 140 కోట్ల మంది భారతీయులు ఊహించని విధంగా అన్నట్లుగా ట్రంప్ నుంచి ఓ ప్రకటన విడుదలయ్యింది. దీంతో.. అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు! తేరుకునేలోపు.. ఇరు దేశాల విదేశీమంత్రిత్వ శాఖలు మీడియా ముందుకు వచ్చాయి. ప్రపంచానికి ట్రంప్ ముందుగా చెప్పిన విషయాన్నే చెప్పాయి!

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన ప్రకాశ్ రాజ్... సర్ధార్ డొనాల్డ్ సింగ్ ట్రంప్, సర్పంచ్ ఆఫ్ అమిక్రా కలాన్ అంటూ ఆయనకు తలపాగా చుట్టి, మీసం పెట్టిన (ఏఐ!) పిక్ షేర్ చేశారు. ఈ సందర్భంగా... "అమెరికా సైన్యం పాక్ లోకి చొరబడి లాడెన్ ను చంపితే న్యాయమన్నారు. అదేపని భారత్ చేస్తే మాత్రం సీజ్ ఫైర్ చేయాలంటున్నారు? ఏ షరతులతో ఈ ఒప్పందం చేసుకున్నారు?" అని ప్రశ్నించారు!

ఇదే సమయంలో... "అమెరికా మధ్యవర్తిత్వలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయని.. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్, పాక్ అంగీకరించాయని" ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అనంతరం... "కాబట్టి మాలిక్ ట్రంప్ మన సుప్రీం నాయకుడికి, పాకిస్తాన్ ఉగ్రవాద నాయకుడికి కామన్ సెన్స్ లేదా గ్రేట్ ఇంటెలిజెన్స్ లేవని చెప్పాల్సి వచ్చింది" అని స్మైల్ ఎమోజీలతో ట్వీట్ చేశారు.

కాగా... 9/11 దాడులు నిర్వహించి, అమెరికన్ పౌరుల మరణాలకు కారకుడయ్యాడనే కారణంతో ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా సైన్యం పాకిస్థాన్ వెళ్లి మరీ మట్టుబెట్టింది. అతడి మృతదేహాన్ని సముద్రంలో పడేసింది! అయితే.. భారతీయులను చంపిన ఉగ్రవాద నాయకుడు పాక్ లో ఉంటే.. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపడితే.. అదే అమెరికా సీజ్ ఫైర్ అనడం పై చర్చ జరుగుతుంది!

Tags:    

Similar News