పెద్ద బ్యాంకులే ఉంటాయి... విలీనం తప్పదు

దేశంలో ఎన్నో బ్యాంకులు ఉన్నాయి. కాల క్రమంలో అవసరాలకు అనుగుణంగా వాటిని కొనసాగిస్తూ వస్తున్నారు.;

Update: 2025-11-16 03:50 GMT

దేశంలో ఎన్నో బ్యాంకులు ఉన్నాయి. కాల క్రమంలో అవసరాలకు అనుగుణంగా వాటిని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే అంతర్జాతీయ అవసరాలు పోటీ ప్రపమంతో తట్టుకునే నైపుణ్యం, ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకుని జోరుగా ముందుకు సాగే విషయంలో దేశీయ బ్యాంకుల ప్రస్తుత స్వరూప స్వభావాలు సరిపోవని వాటిని సమూలంగా మార్చాలని అయితే చురుకైన ప్రతిపాదనలు తెర ముందుకు వస్తున్నాయి.

నిర్మలమ్మ సంకేతాలు :

ఈ మధ్యనే ముంబైలో జరిగిన ఒక సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకుల విలీనం మీద కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు స్పష్టంగా చెప్పేశారు. దానికి ఆమె చెప్పిన కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రాతీయ జాతీయ స్థాయి బ్యాంకుల సామర్ధ్యం పెంచుకోవాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ బ్యాంకులుగా ఎదగాలంటే ఇంకా చాలా చేయాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం ఉన్న బ్యాకులతో అది జరిగేది కాదని కూడా కుండబద్దలు కొట్టారు. అంతే కాదు బ్యాంకుల విలీనం అనివార్యం అన్న సంకేతాలను నిర్మలమ్మ ఇచ్చారు. అదే సమయంలో ప్రైవేటు బ్యాంకులను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

మరోసారి విలీనం :

ఇక కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తరువాత ఈ తరహా ఆలోచనలకు మద్దతు ఇస్తూ దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడడం విశేష పరిణామం. ఆయన తజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ బ్యాంకుల విలీనం మీద కీలకమైన వ్యాఖ్యలే చేశారు. దాంతో తొందరలోనే ఆ ప్రక్రియ ఉంటుందని అంతా అంటున్నారు.

అయిదేళ్ల క్రితం :

సరిగ్గా అయిదేళ్ళ క్రితం పది బ్యాంకులు ఒక నాలుగు పెద్ద బ్యాంకులలో విలీనం అయ్యాయి. ఇది దేశంలో చాలా కాలం తరువాత జరిగిన పెద్ద విలీనం ప్రక్రియగా అంతా భావించారు. ఐతే ఆ తరువత రీజనల్ రూరల్ బ్యాంకులు విలీనం అన్నది జరుగుతూ వచ్చింది. అయితే ఇపుడు మరిన్ని బ్యాంకులు ఆ జాబితాలో ఉన్నాయని చెబుతున్నారు.

చిన్న బ్యాంకులు ఉండవా :

దేశంలో చిన్న బ్యాంకులకు తగినంత సామర్థ్యం స్తోమత లేకపోవడంతో పోటీని తట్టుకుని నిలబడలేకపోతున్నాయని అంటున్నారు. దాంతో 2020 లో ఈ తరహా చిన్న చిన్న ప్రభుత్వ బ్యాంకుల్ని గుర్తించి వాటిని కొన్ని పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయడం జరిగింది. ఇక ఇపుడు మరో సారి బ్యాంకులను ఎంపిక చేసి పెద్ద బ్యాంకులలో కలపాలన్న దాని మీద తీవ్రమైన కసరత్తు సాగుతోంది. అయ్హితే ఈసారి ఏకంగా పది నుంచి పన్నెండు బ్యాంకులను వాటి స్వరూపం కనుమరుగు చే స్తూ ఇతర పెద్ద బ్యాంకులలో విలీనం చేస్తారు అని అంటున్నారు. దాని వల్ల ఈ బ్యాంకుల సంఖ్య కూడా ఇంకా తగ్గిపోతుంది అని అంటున్నారు.

చరిత్రలోనికే :

చాలా బ్యాంకులు గతంలో కొన్ని చారిత్రాత్మక సందర్భాలలో ఏర్పాటు అయ్యాయి. అలా ఏపీలో ఆంధ్రా బ్యాంక్ ఎన్నో దశాబ్దాలుగా ఉంది. కానీ దానిని 2020లో యూనియన్ బ్యాంక్ లో విలీనం చేశారు. అలాగే కార్పొరేషన్ బ్యాంక్ సైతం యూనియన్ బ్యాంక్ లో కలిసిపోయింది. కెనరా బ్యాంక్ లో సిండికేట్ బ్యాంక్ ని కలిపారు. అదే విధంగా చూస్తే కనుక ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అలాగే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి వాటితో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేసి ఏకంగా 27 దాకా ఉన్న బ్యాంకులను 12 కి కుదించారు. తాజా విలీన ప్రక్రియతో దేశంలో ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 8 కి తగ్గనుంది అని అంటున్నారు. రానున్న కాలంలో ప్రైవేట్ బ్యాంకులను ప్రోత్సహించడం ఉన్న పెద్ద బ్యాంకులను అంతర్జాతీయ బ్యాంకులుగా మార్చడం వంటివి చేయాలని చూస్తున్నారు.

Tags:    

Similar News