నై నై అంటున్న నైరుతి...వానదేవుడి షాక్ !
పూర్తిగా వ్యవసాయిక దేశం అయిన భారత్ లో వర్షాలే ఆధారం. ఎంతలా అంటే దేశ జీడీపీని ప్రభావితం చేసేటంతలా.
పూర్తిగా వ్యవసాయిక దేశం అయిన భారత్ లో వర్షాలే ఆధారం. ఎంతలా అంటే దేశ జీడీపీని ప్రభావితం చేసేటంతలా. గ్రామీణ ప్రాంతాలు దేశంలో నూటికి డెబ్బై శాతం ఉన్నాయి. దాంతో దేశ జాతీయ స్థూల ఆదాయం వృద్ధి చెందాలీ అంటే గ్రామీణ భారతం పచ్చగా ఉండాలి. అది ఎపుడు సాధ్యపడుతుంది అంటే భారీగా సమాయనుకూలంగా వానలు పడి పంటలు పండినపుడు. దేశంలో ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1న మొదలవుతుంది. కానీ దేశంలో అగ్రికల్చర్ ఇయర్ మాత్రం జూన్ లో స్టార్ట్ అవుతుంది. దానికి కారణం నైరుతు రుతు పవనాల రాక. ఈ రుతు పవనాలు ఎంత తొందరగా వస్తే అంత సంబరంగా ఏరువాక స్టార్ట్ అవుతుంది. దాంతో రైతాంగం సైతం సంబరాలు చేసుకుంటుంది. కానీ ఈసారి పరిస్థితి చూస్తే నైరుతి నై నై అంటోంది.
బ్యాడ్ న్యూస్ చెబుతోందా :
సకాలంలో నైరుతి రుతు పవనాలు దేశంలోకి ప్రవేశించడం అంటే మే నెలాఖరు అన్న మాట. ఈ మేరకు భారత వాతావరణ విభాగం ఐఎండీ అయితే మొదట చెప్పింది మే 26న నైరుతి దేశంలో ఎంట్రీ ఇస్తుందని. కానీ ఆ డేట్ తప్పింది. ఆ తరువాత మే 30, 31 తేదీలు అన్నా కూడా అదీ జరగలేదు. జూన్ 1 లేదా 3 అని చెప్పినా ఇపుడు ఆ డేటూ మారింది. లేటెస్ట్ డేట్ ఏంటి అంటే జూన్ 8 తరువాత అని అంటున్నారు. అయితే అది కూడా అంత కన్ ఫర్మ్ అవునా కాదా అన్నది ఒక పెద్ద డౌట్. మరో వైపు చూస్తే ఈసారి నైరుతి ఆగమనం లేట్ అయినా వానలు కూడా చాలా తక్కువ పడతాయని దానికి కారణం నైరుతి బలహీనంగా ఉందని. ఈ వార్తలు అయితే రైతాంగాన్ని కాదు దేశ ఆర్ధిక నిపుణులను కూడా షాక్ కి గురి చేస్తున్నాయి. ఈసారి వానలు తక్కువ పడితే ఆ ప్రతికూల పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంతా ఆలోచిస్తున్నారు. ఈసారి తేలిక పాటి వానలే పడతాయంటే వ్యవసాయం సంగతి ఏమిటి అన్నది కూడా మరో చింతగా మారుతోంది.
కేరళం వైపు చూపు :
భారత్ లో నైరుతి ఎంట్రీకి గేట్ వే కేరళం రాష్ట్రం. అక్కడ నుంచే మెల్లగా దేశంలోకి ప్రవేశించి మొత్తం దేశమంతా కొద్ది కాలంలోనే సర్దుకుని భారీ వానలు కురుస్తాయి. అలా వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయి సెప్టెంబర్ నెలాఖరు వరకూ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం కేరళంలో కొన్ని ప్రంతాలలో వర్షాలు పడుతున్నాయి కానీ నైరుతి ఆరంభ సూచిన అది కాదని ఐఎండీ చెబుతోంది. నైరుతి రాకను గుర్తించాలంటే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. కేరళంలోని ఈ సీజన్ లో ఏకంగా అరవై శాతం పైగా వానలు పడితే నైరుతి ఎంటర్ అయినట్లుగా భావిస్తారు. అలాగే అరేబియా సముద్రం నుంచి పశ్చిమ దిశగా వీచే గాలులు ఆ నిర్దిష్ట వేగాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఆ మీదట ఆయా ప్రాంతమంతా తగినన్ని మేఘాలు విస్తరించి ఉండాలి. ఇవన్నీ నైరుతి రుతు పవనాల ఆగమాన్ని సూచిస్తాయి. ప్రస్తుతం అయితే కేరళం రాష్ట్రంలో కొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. మేఘాలు విస్తరించి కూడా ఉన్నాయి. కానీ అసలైన ప్రమాణం అయిన అరేబియా సముద్రం నుంచి గాలులు వీయడం లేదని ఐఎండీ సైంటిస్టూ చెబుతున్నారు . ఈ మూడు ఒకేసారి కలసి ఉంటేనే నైరుతి పవనాల సీజన్ స్టార్ట్ అయినట్లు. అపుడు వర్షాకాలం వచ్చినట్లుగా చెబుతారు.
ఎల్ నినో ప్రభావం తో :
ఇక ఈసారి పూర్తి స్థాయి వానలు కురిసే అవకాశాలు కూడా తక్కువ అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దానికి ఎల్ నినో ప్రభావం కారణం అని స్పష్టం చేస్తున్నారు. దాని వల్ల గత ఏడాది కంటే ఈసారి తక్కువ వానలు పడతాయని వాటితోనే సర్దుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. నైరుతి రుతు పవనాలు ఆలస్యమైనా లేదా ఎంట్రీ ఇచ్చినా బలహీనం కావడం వెనక ఎల్ నినో ప్రభావం గట్టిగా ఉంటుందని అంటున్నారు. ఈ విధంగా వర్షాభావ పరిస్థితులు కనుక ఉంటే ఇది దేశ ఆర్ధిక వ్యవస్థ మీద కూడా పెను ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.