భారత్ తలచుకుంటే బంగ్లా బ్రతుకు బస్టాండే.. ఇవిగో డిటైల్స్!

ఇక నెక్స్ట్ విద్యుత్ విషయానికొస్తే.. భారత్ తలచుకుంటే బంగ్లాలో చీకటి కమ్ముకునే అవకాశాలు పుష్కలం.;

Update: 2026-01-11 06:12 GMT

తమ బానిస బ్రతుకులకు విముక్తి కలగడానికి, తమకు స్వాతంత్ర్యం రావడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్ని రకాలుగా ఎంతో ఆసరగా నిలిచిన భారతదేశంపై బంగ్లాదేశ్ లోని పలువురు రాజకీయ స్వార్థపరులు, అజ్ఞానులు, విద్యార్థి నాయకులమని చెప్పుకుంటున్న అర్ధజ్ఞానులు, గతం మరిచిన మూర్ఖులు అక్కసు వెళ్లగక్కుతున్నారనే చర్చ గత కొన్ని రోజులుగా విపరీతంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ఆగ్రహిస్తే బంగ్లా ఏ స్థాయిలో ఎండిపోతుందో ఇప్పుడు చూద్దామ్...!

అవును.. గతంలో తమను తొక్కినారతీసిన పాకిస్థాన్ ను నమ్ముకునో.. లేక, ఈ దేశాన్ని మరో ఇరాన్, పాకిస్థాన్ లాగా మార్చాలని తపిస్తున్న పలువురి స్వార్థ రాజకీయ ఆలోచనల ఫలితమో తెలియదు కానీ.. భారత్ పై ఎగిరెగిరి పడుతోంది బంగ్లాదేశ్. పైగా.. అక్కడున్న మైనారిటీలైన హిందువులపై దాడులకు పాల్పడుతూ, వారిని హత్యలు చేస్తూ భారత్ ని మరింతగా రెచ్చగొడుతోంది. ఈ సమయంలో భారత్ తలచుకుంటే నిత్యావసర వస్తువుల నుంచి కరెంట్ వరకూ వారి పరిస్థితి అంధకారంలో ఆకలికేకలే!

వాస్తవానికి ఏ రకంగా చూసినా బంగ్లాదేశ్ కు అన్ని విధాలుగానూ భారతే పెద్ద, కీలక దిక్కు. ఉదాహరణకు... బంగ్లాదేశ్ మార్కెట్లలో లభించే ఉప్పు, పప్పులు నుంచి ఉల్లిపాయలు, పండ్లతో పాటు ఇతర నిత్యావసర వస్తువులలో అత్యధిక భాగం భారత్ నుండే ఎగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఒకవేళ భారత్ తన ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే, సరైన సమయం చూసుకుని నిత్యావసర వస్తువుల ధరలతో ఆ దేశం అల్లకల్లోలం అయిపోయేలా పథకం రచిస్తే.. బంగ్లాదేశ్‌ లో ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున పెరగడమే కాదు.. కనీస ఆహార భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఇక నెక్స్ట్ విద్యుత్ విషయానికొస్తే.. భారత్ తలచుకుంటే బంగ్లాలో చీకటి కమ్ముకునే అవకాశాలు పుష్కలం. ఎందుకంటే... భారత్ నుండి దాదాపు 1,160 మెగావాట్ల విద్యుత్తును ఆ దేశం దిగుమతి చేసుకుంటోంది. దీనికి తోడు, ఇండో-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌ షిప్ పైప్‌ లైన్ (ఐ.బీ.ఎఫ్.పీ.ఎల్) ద్వారా పెద్ద ఎత్తున డీజిల్ సరఫరా జరుగుతోంది. ఇందులో భాగంగా... భారతదేశం టు బంగ్లా దీడ్జిల్ దిగుమతులు 1,80,000 టన్నులు అని నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయంలో భారత్ గట్టిగా ఉంటే బంగ్లా పరిస్థితి అంధకారంలో ఆందోళనే! రవాణా వ్యవస్థా స్తంభించిపోవడమే!

ఇదే సమయంలో వస్త్ర పరిశ్రమలో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న బంగ్లాకు కావాల్సిన ముడిసరుకులు, పత్తి, యంత్రాల కోసం కూడా భారత్ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అలా అని అక్కడితో ఆగిపోలేదు.. ఆ దేశ క్రికెట్ బోర్డుకు స్పాన్సర్ల విషయంలో సైతం భారతదేశమే కీలక భూమిక పోషిస్తున్న పరిస్థితి. ఈ స్థాయిలో భారత్ పై ఆధారపడిన బంగ్లాదేశ్ నాయకులు, పలువురు ప్రజలు.. నిన్న జ్ఞాపకం లేక, రేపు గురించి అవగాహన లేక.. నేడు మాత్రం ఎగిరెగిరి పడుతున్నారు!

Tags:    

Similar News