• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యుద్ధం వేళ భారత్...

యుద్ధం వేళ భారత్ బయలుదేరిన విద్యార్థులు.. రూట్ మ్యాప్ ఇదే!

| ఈ సమయంలో అక్కడున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది.

By - Tupaki Desk
Update: 2025-06-17 04:15 GMT

ప్రస్తుతం పశ్చిమాసియా రగిలిపోతోంది. ఇజ్రాయెల్ - ఇరాన్ ల మధ్య యుద్ధం కారణంగా భయానక వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో రాజధాని టెహ్రాన్ లో నివాసితులు వేల సంఖ్యలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. అక్కడ నుంచి భారతీయులను తరలించేందుకు రంగం సిద్ధం చేసింది.

అవును... గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో పరిస్థితులు భయంకరంగా మారిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం కారణంగా పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ సమయంలో అక్కడున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. తొలి విడతలో 100 మందిని టెహ్రాన్ నుంచి బయలుదేరించింది.

వాస్తవానికి ఇరాన్ లో భారత్ కు చెందిన వందలాదిమంది విద్యార్థులు ఉన్నారు. ఈ సమయంలో.. ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగిస్తుండటంతో భారత్ లోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహకరించాలని ఇరాన్ కు భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది.

అయితే ప్రస్తుతం వీరిని వాయుమార్గంలో భారత్ కు రప్పించే అవకాశం లేదు. ఇప్పటికే ఇరాన్ వాయుమార్గం పూర్తిగా మూసివేసిన పరిస్థితి. దీంతో.. ఇరాన్ నుంచి భారత విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి అర్మేనియాకు చేరుకున్న అనంతరం.. అక్కడ నుంచి అజర్ బైజాన్, తుర్కమెనిస్థాన్, ఆఫ్గనిస్తాన్ మీదుగా భారత్ కు తరలించనున్నారు!

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... ప్రతి ఒక్కరూ వెంటనే టెహ్రాన్‌ ను ఖాళీ చేయాలని కోరారు. ఇరాన్ అమెరికాతో అణు ఒప్పందంపై సంతకం చేసి ఉండాలని పునరుద్ఘాటించారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో.. వాట్ నెక్స్ట్ అనేది చర్చనీయాంశంగా మారింది.

Tags:    
  • IndiaEvacuation 
  • TehranCrisis 
  • IsraelIranWar 
  • IndianStudents 
  • IranIsraelWar 
  • WestAsiaConflict 
  • GlobalTensions 
  • AirspaceClosure 
  • SafePassage 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS