ఇది కదా భారత్... కష్టంలో ఆదుకోవడానికి ఎంత రిస్క్ అయినా..!

ఈ ప్రపంచంలో భారతదేశానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అందుకే త్వరలో విశ్వగురు అవ్వనుందని అంటున్నారు! ఇక్కడ యుద్ధాల కంటే శాంతికి ప్రాధాన్యత ఎక్కువ.. కక్ష సాధింపులకంటే కరుణకు స్థానం ఎక్కువ.;

Update: 2025-12-02 03:56 GMT

ఈ ప్రపంచంలో భారతదేశానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అందుకే త్వరలో విశ్వగురు అవ్వనుందని అంటున్నారు! ఇక్కడ యుద్ధాల కంటే శాంతికి ప్రాధాన్యత ఎక్కువ.. కక్ష సాధింపులకంటే కరుణకు స్థానం ఎక్కువ. తాజాగా శ్రీలంక తుపాను నేపథ్యంలో పాకిస్థాన్ కు ఓ అవకాశం ఇచ్చింది భారత్. ఇందులో భాగంగా... తన గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి ఆ ప్రమాదకరమైన దేశానికి నవ్వుతూ అనుమతి ఇచ్చింది!

అవును... దిట్వా తుపాను తర్వాత శ్రీలంక తీవ్ర విధ్వంసాన్ని ఎదుర్కొంటోంది. ఈ తుపాను కారణంగా శ్రీలంకలో సుమారు 200 మందికిపైగా మృతి చెందగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో.. ఆ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ సమయంలో రంగంలోకి దిగిన భారత్.. శ్రీలంకను ఆదుకునేందుకు "ఆపరేషన్ సాగర్ బంధు" పేరుతో సహాయక చర్యలు చెపడుతోంది. మరోవైపు శ్రీలంక వెళ్లే పాక్ విమానాలకు తన గగనతలాన్ని తెరిచింది.

వివరాళ్లోకి వెళ్తే... వరదలతో అతలాకుతలమైన శ్రీలంకకు వెళ్లే పాకిస్థాన్ మనవతా సహాయ విమానానికి భారతదేశం వేగవంతమైన ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ మంజురు చేసింది. అయితే దీనిపైనా పాకిస్థాన్ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా... తమ వైమానిక ప్రాంతాన్ని యాక్సెస్ చేయడానికి న్యూఢిల్లీ అనుమతి నిరాకరించిందంటూ.. (అలవాటులో భాగంగా...!) ఆ దేశంలోని మీడియాలో తప్పుడు కథనాలు మొదలయ్యాయి.

అయితే ఈ వాదనను భారత్ తిప్పికొట్టింది. అత్యవసర సహాయ కార్యకలాపాలు ఉన్నందున పాక్ అభ్యర్థనను గంటల్లోనే ప్రాసెస్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా... భారత వైమానిక ప్రాంతం మీదుగా ప్రయాణించడానికి అనుమతి కోరుతూ పాకిస్థాన్ సోమవారం (డిసెంబర్ 1 - 2025) మధ్యాహ్నం 1:00 గంటలకు తమకు అధికారిక అభ్యర్థనను సమర్పించిందని వెల్లడించారు. అందుకు భారత్ కొన్ని గంటల్లోనే అనుమతి ఇచ్చిందని తెలిపారు.

ఆ అభ్యర్థన శ్రీలంకకు మానవతా సహాయానికి సంబంధించింది కావడంతో.. భారత ప్రభుత్వం పాకిస్థాన్ అభ్యర్థనను అదే రోజు సాయంత్రం 3:30 గంటలకే అధికారిక మార్గాల ద్వారా ఆ ప్రభుత్వానికి తెలియజేసిందని అధికారులు వెల్లడించారు. కాగా... పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తన గగనతలాన్ని పాకిస్థాన్ విమానాలకు మూసివేసిన సంగతి తెలిసిందే!

భారత్ ఆపరేషన్ సాగర్ బంధు!:

అంతకుముందు రోజు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకేతో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తుపాను ప్రభావం వల్ల సంభవించిన ప్రాణనష్టం, విస్తృత విధ్వంసం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే.. ఆపరేషన్ సాగర్ బంధు కింద మరింత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు!

Tags:    

Similar News