'నోటా'కు ఎక్కువ ఓట్లు వస్తే విజేత ఎవరో తెలుసా ?

2013లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తొలిసారి నోటా ఓటును ప్రవేశపెట్టారు.

Update: 2024-04-24 11:40 GMT

వివిధ చట్టసభలకు నిర్వహించే ఎన్నికలలో ఆయా పార్టీల నుండి నిలబడ్డ అభ్యర్థులకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే దశాబ్దం క్రితం ఎన్నికల కమీషన్ నోటా బటన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

2013లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తొలిసారి నోటా ఓటును ప్రవేశపెట్టారు. 2013 సుప్రీం తీర్పు తర్వాత అన్ని ఎన్నికల్లోనూ ఓటర్లకు నోటా ఆప్షన్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ అప్షన్ మూలంగా ఓటరు తన అయిష్టాన్ని. అభిష్టాన్ని ప్రకటించవచ్చని, తద్వారా రాజకీయ పార్టీలు మంచి అభ్యర్థులను నిలబెడతాయని ఎన్నికల సంఘం అభిలాష.

మరి ఎన్నికలలో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే విజేతగా ఎవరిని ప్రకటిస్తారు ?

అంటే నోటా తర్వాత రెండో స్థానంలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. డిసెంబర్ 2018లో హర్యానాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నోటా అత్యధిక ఓట్లను పొందింది.

Tags:    

Similar News