ఆ డివైజ్ తో సేంద్రీయమా? కాదా? పట్టేయొచ్చు
అయితే.. కొన్నింటికి సేంద్రీయ ఉత్పత్తులా? కాదా? అనే దానికి ప్రభుత్వం నుంచి కొన్ని ప్రమాణాల్ని సిద్ధం చేసి..ఆగ్ మార్క్ తరహాలో కొన్ని గుర్తుల్ని ఇస్తున్నారు.;
తినే ఆహారం మీద అవగాహన అంతకంతకూ పెరిగిపోతోంది. క్రిమి సంహారకాలు.. రసాయనాలు అదే పనిగా వినియోగించి పండించే పంటల కంటే సహజసిద్ధంగా పండించే ఆహార ఉత్పత్తులకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. అయితే..ఇక్కడో పెద్ద చిక్కు ఉంది. చాలాచోట్ల.. చాలామంది సేంద్రీయ ఉత్పత్తులగా పేర్కొంటూ అమ్మకాలు జరుపుతున్నారు. అయితే.. కొన్నింటికి సేంద్రీయ ఉత్పత్తులా? కాదా? అనే దానికి ప్రభుత్వం నుంచి కొన్ని ప్రమాణాల్ని సిద్ధం చేసి..ఆగ్ మార్క్ తరహాలో కొన్ని గుర్తుల్ని ఇస్తున్నారు.
అయితే.. పండ్లు.. కూరగాయలకు సంబంధించి అలాంటి గుర్తింపు ఏమీ లేదు. ఇలాంటప్పుడు సదరు ఉత్పత్తులు సేంద్రీయమా? కాదా? అన్నది ప్రశ్నగా మారింది. ఇలాంటి చిక్కుముడులు విప్పేందుకు హైదరాబాద్ కు చెందిన ఒక సంస్థ సరికొత్త ఆవిష్కరణ చేపట్టింది. దీనికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇంతకూ ఈ పరికరం ఎలా పని చేస్తుంది. దీన్ని రూపొందించిన సంస్థ ఏది? అన్న విషయానికి వస్తే.. హైదరాబాద్ శివారులోని బిట్స్ పిలానీ విద్యా సంస్థకు చెందిన పరిశోధకులు ఈ పరికరాన్నితయారు చేశారు.
ఇదెలా పని చేస్తుందంటే.. వీరు రూపొందించిన అతి చిన్న పట్టీని పండ్లు కానీ కూరగాయలకు తీసుకెళ్లి అతికించి.. బిట్స్ పిలానీ సంస్థ తయారు చేసిన పరికరాన్ని ఆన్ చూస్తే.. రెడ్ లైట్ వెలిగితే.. దీంతో సదరు ఉత్పత్తి సేంద్రీయం కాదన్న సంగతి తెలిసిపోతుంది. ఈ పరికరంతో ఏది సేంద్రీయం? ఏది కాదన్నది తేలిగ్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనికి మినో మీటర్ అన్న పేరునుపెట్టారు. వీరు రూపొందించిన పరికరానికి సంబంధించిన పరిశోధన పత్రాన్ని అంతర్జాతీయ జర్నల్ మైక్రో మెకానికల్ లో పబ్లిష్ కావటం గమనార్హం. అంతర్జాతీయంగా ఈ పరిశోధనకు గుర్తింపు లభించే వీలుందన్న మాట వినిపిస్తోంది.