హైదరాబాద్ లో ఆ రెండు పొలిటికల్ ఫ్యామిలీలు కనుమరుగైనట్లేనా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాగంటి సునీత రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినట్లుగా చెప్పాలి.;

Update: 2025-11-14 10:30 GMT

కాలానికి మించిన శక్తి మరి దేనికి ఉండదనే చెప్పాలి. కాలమహిమ అన్న మాట ఊరికే అనరన్నట్లుగా అనిపిస్తుంది హైదరాబాద్ రాజకీయాలను చూసినప్పుడు. ఒకప్పుడు తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన నేతలు.. ఆ తర్వాతి కాలంలో వారి కుటుంబాలు ఆ పరంపరను కొనసాగించలేక కనుమరుగవుతుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే హైదరాబాద్ లోని రెండు బలమైన రాజకీయ కుటుంబాలకు ఎదురైనట్లుగా చెప్పాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాగంటి సునీత రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినట్లుగా చెప్పాలి.

హైదరాబాద్ మహానగర పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించేవారు దివంగత మాగంటి గోపీనాథ్. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందనటానికి ఆయన ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలవటమే నిదర్శనంగా చెప్పొచ్చు. అలాంటి ఆయన అనారోగ్యంతో కాలం చేయటం.. ఈ నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారు. మాగంటి పరంపరను ఆమె కొనసాగిస్తారన్న ప్రచారం భారీగా జరిగింది. అయితే.. అదేమంత తేలికైన విషయం కాదన్న విషయం తాజాగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

తాజా ఓటమితో మాగంటి సునీత రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లే చెప్పాలి. మాగంటి గోపీనాథ్ కు సునీతకు మధ్యనున్న తేడా తాజా ఎన్నికల ఫలితాల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించిన పరిస్థితి. దాదాపు కొన్నేళ్లుగా జూబ్లీహిల్స్ లో తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించిన మాగంటి ఫ్యామిలీకి తాజా ఓటమి.. వారి కుటుంబానికి రాజకీయంగా గడ్డు పరిస్థితి తీసుకొచ్చి పెడుతుందన్న విషయాన్ని వారు గుర్తించక తప్పని పరిస్థితి.

హైదరాబాద్ లోని మరో రాజకీయ కుటుంబం ఉంది. షెడ్యూల్ కూలాలకు చెందిన బీఆర్ఎస్ నేత సాయన్న పేరు చెప్పినంతనే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం గుర్తుకు వస్తుంది. టీడీపీలో ఉన్న ఆయన ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో బీఆర్ఎస్ (ఆయన చేరినప్పుడు టీఆర్ఎస్) లో బలమైన నేతగా.. అదేసమయంలో గ్రేటర్ పరిధిలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన పరిస్థితి. 2023 ఎన్నికలకు కాస్త ముందుగా అనారోగ్యంతో హటాత్తుగా మరణించిన సాయన్న స్థానంలో ఆయన కు కుమార్తెను బరిలోకి దించారు. కేసీఆర్ ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఎమ్మెల్యేగా గెలవటం అంతతేలియై కు.

అయితే.. ఇదంతా జరిగిన కొద్దీ రోజులకే రో్డు ప్రమదం ఎమ్మెల్యే లాస్య నందిత మరణించారు. దీంతోమరోసారి ఆ కుటుంబానికి చెందిన వారికే కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు టికెట్ కేటాయించిన బీజేపీ.. తమ అభ్యర్థి ఉత్తినే గెలుస్తాడని భావించారు. అందకు భిన్నంగా సాగి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థిగా బరిలోకి దిగారు శ్రీగణేశ్. నిజానికి కాంగ్రెస్ లో చేరటానికి ముందంతా అయన బీజేపీలో ఉండేవారు.ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మారారో.. ఆయన తీరు మారింది.

మొత్తంగా రెండు ఉప ఎన్నికలు హైదరాబాద్ లో పేరు మోసిన రెండు రాజకీయ కుటుంబాలకు తీరని కష్టాన్ని.. తిరుగులేని అధిక్యతకు గండి పడేలా చేసిందని చెప్పాలి. తమ కనుసైగతో నియోజకవర్గాన్ని శాసించిన ఇద్దరు నేతలు.. వారు అనూహ్య రీతిలో కాలం చేసిన తర్వాత.. వారి కుటుంబాలు రాజకీయ ప్రాముఖ్యతను కోల్పోయిన తీరు చూస్తే.. కాలమహిమ కాకుండా ఇంకేం ఉంటుంది. ఇప్పటికే కంటోన్మెంట్ నియోజకవర్గంలో సాయన్న కుటుంబం తన ఛరిష్మాను కోల్పోతుంటే.. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మాగంటి కుటుంబానికి అలాంటి పరిస్థితే నెలకొందన్న మాట వినిపిస్తోంది. బ్యాడ్ లక్ అంటే వీరిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు కావటం గమనార్హం.

Tags:    

Similar News