కర్నూలు బస్సు ప్రమాదం.. మద్యం మత్తులో బైకర్!.. వీడియో వైరల్!
వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు (డీడీ 01ఎన్ 9490) గురువారం రాత్రి 9:40 గంటలకు హైదరాబాద్ లోని కూకట్ పల్లి నుంచి బెంగళూరుకు బయలుదేరింది;
వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు (డీడీ 01ఎన్ 9490) గురువారం రాత్రి 9:40 గంటలకు హైదరాబాద్ లోని కూకట్ పల్లి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో కర్నూలు శివారులోని చిన్నటేకూరు దాటిన తర్వాత చెట్లమల్లాపురం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.
దీంతో.. ఆ బైక్ బస్సు కింద ఇరుక్కుపోయింది. వేగంగా దూసుకెళ్తున్న బస్సు సుమారు 200 మీటర్ల దూరం బైక్ ను ఈడ్చుకెళ్లిన తర్వాత ఆగింది.. ఆ రాపిడికి బైక్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే ద్విచక్రవాహనదారు శివశంకర్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ క్రమంలో అతడికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది!
అవును... కర్నూలులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పదుల సంఖ్యలో కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఈ సమయంలో ఈ బస్సు ప్రమాద ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇందులో భాగంగా... ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్ లోకి సదరు బైకర్ శివశంకర్ వెళ్లిన దృశ్యాలు వైరల్ గా మారాయి. పెట్రోల్ కొట్టించుకునేందుకు శివశంకర్ అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో అతడితోపాటు మరో యువకుడు బైక్ పై ఉన్నాడు. అయితే... ఆ సమయంలో శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది! దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది!
కాగా... తెల్లవారుజామున సుమారు 3:05 - 3:10 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొట్టిందని చెబుతున్నారు. ఆ దెబ్బకు ఆ బైక్ బస్సుకింద ఇరుక్కుంది. అనంతరం సుమారు 200 మీటర్ల దూరం వాహనాన్ని ఈడ్చుకెళ్లి ఆగింది. రాపిడి కారణంగా బైక్ ట్యాంకు నుంచి పెట్రోలు లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందిన బైకర్ శివశంకర్ మద్యం మత్తులో ఉన్నాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది!