ఏపీలో జనసేన గెలిచే సీట్లు ఎన్ని?

ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొందరు విశ్లేషకులు.. సిఫాలజిస్టుల అంచనాను చూస్తే.. పదకొండు స్థానాలకు తగ్గకుండా జనసేన గెలుస్తుందని చెబుతున్నారు.

Update: 2024-05-23 13:30 GMT

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో జరిగే ఎన్నికల్లో ఇప్పటికే ఐదు దశలు ముగిసాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. తాజా ఎన్నికల్లో హోరాహోరీగా ఎన్నికలు జరిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే అవుతుంది.

అధికార వైసీపీ ఒకవైపు.. విపక్ష తెలుగుదేశంతో పాటు జనసేన.. బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో తలపడ్డాయి. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ముగిసి పది రోజులు దాటింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే జూన్ 4 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో ఎవరు గెలవనున్నారు? అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఉన్న ప్రతి చోట ఇదే చర్చ నడుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పొత్తులో భాగంగా కూటమిలో కీలకమైన జనసేన ఎన్ని సీట్లలో విజయాన్నినమోదు చేయనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తెలుగువారు ఎవరు కలిసినా.. ఏపీలో ఎవరు గెలుస్తారన్నది మొదటి ప్రశ్న అయితే.. జనసేనకు వచ్చే సీట్లు ఎన్ని? అన్నది తర్వాతి ప్రశ్నగా మారింది. 2014 ఎన్నికలకు ముందు పార్టీని అనౌన్స్ చేసిన పవన్ కల్యాణ్.. ఆ ఎన్నికల్లో పోటీ చేయకపోవటం..మద్దతు ఇచ్చి.. టీడీపీ.. బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు.

Read more!

2019లో మాత్రం పాత మిత్రుల మధ్య స్పర్థలతో విడిపోయి.. బీఎస్పీ.. కమ్యునిస్టులతో కలిసి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటును సొంతం చేసుకుంది. సదరు ఎమ్మెల్యే సైతం తర్వాతి కాలంలో అధికార వైసీపీ గూటికి చేరుకున్నారు. ఈసారి మాత్రం 2014 కాంబినేషన్ ను రిపీట్ చేశారు. 2019లో మాదిరి కాకుండా తాజా ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒక్కచోటే పోటీలో నిలిచారు. పిఠాపురం నుంచి ఆయన బరిలో దిగగా.. ఆ పార్టీ మొత్తం 21 అసెంబ్లీ స్థానాల్లోనూ.. రెండు ఎంపీ స్థానాల్లోనే పోటీ చేసింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొందరు విశ్లేషకులు.. సిఫాలజిస్టుల అంచనాను చూస్తే.. పదకొండు స్థానాలకు తగ్గకుండా జనసేన గెలుస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో మరో నాలుగు స్థానాల్లో తీవ్రమైన పోటీ నెలకొని ఉందంటున్నారు. ఇక.. జనసేన పోటీ చేసిన స్థానాల్లో మూడుచోట్ల అధికార వైసీపీ సునాయాసంగా గెలుస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో జనసేన ఖాయంగా గెలిచే స్థానాలు ఎన్ని అన్న విషయంలో మాత్రం ఐదు స్థానాలపై మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నారు.

4

గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలు ఇవేనట..

అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురం, కాకినాడ (రూరల్), నర్సాపురం, ఎలమంచిలి, పి.గన్నవరం, భీమవరం, తాడేపల్లి గూడెం, అవనిగడ్డ, తెనాలి.

జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో వైసీపీ పక్కాగా గెలిచే స్థానాలు ఇవేనట..

నెల్లిమర్ల.. రాజోలు.. ఉంగటూరు

అసలేం జరిగినా గెలిచే అవకాశాలు అస్సలు లేని జనసేన స్థానాల్ని చూస్తే..

రైల్వే కొడూరు, పోలవరం, పాలకొండ (ST)

ఎలాంటి వాతావరణం ఉన్నా.. ఏ పార్టీకి ఎంత గాలి వీసినా గెలుపు పక్కా అన్న స్థానాలు ఇవేనట

అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురం, కాకినాడ రూరల్, నర్సాపురం.

Tags:    

Similar News