సైలెంట్ వర్సెస్ వారియర్: మంత్రి రేసులో మహిళా నేతలు.. !
ఇక, నెల్లూరుకు చెందిన మహిళానాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా ఈ రేసులో ముందున్నారు.;
ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు మహిళా నాయకులు రెడీగా ఉన్నారు. ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలు ఇప్పటికే చేశారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే 22 మాసాలు పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మహిళా నాయకులు కూడా దానికి రెడీ అయ్యారు. తమకంటే తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
వీరిలో ఒకరిద్దరు ఫైర్ బ్రాండ్లు ముందు వరుసలో ఉన్నారు. మరికొందరు సైలెంట్‌గా ఉండేవారు.. కూడా తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి ఈ రేసులో ముందు న్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళకు టీడీపీ ప్రభుత్వంలో కడపకు అవకాశం ఇవ్వాలన్న వాదనను ఆమె వినిపిస్తున్నారు. పైగా కడపకు చెందిన నాయకురాలిగా తనకు అవకాశం ఇస్తే.. జిల్లా మొత్తాన్ని గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటానని చెబుతున్నారు.
ఇక, నెల్లూరుకు చెందిన మహిళానాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా ఈ రేసులో ముందున్నారు. అయితే.. ఆమె ఫైర్ కాదు. కాకపోయినా.. సైలెంట్‌గా ముందుకు సాగుతున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ.. ప్రజలకు చేరువగాఉంటూ ఆమె తన పనిని తాను చేసుకుపోతున్నారు. ప్రస్తుతం టీటీడీ సభ్యు రాలిగా కూడా ఉన్న వేమిరెడ్డి మంత్రి సీటు ఇస్తే.. దీనిని వదులుకునేందుకు రెడీ అంటూ వర్తమానం పంపించినట్టు తెలిసింది. మెజారిటీ భాగం ఆమెను పదవి వరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక, ఇదే రేసులో మండలిలో చీఫ్ విప్‌గా ఉన్న పంచుమర్తి అనురాధ కూడా.. మంత్రి వర్గ రేసులో ఉన్న ట్టు తెలిసింది. ఇటీవల.. మండలి లాబీల్లో ఆమెను మీడియా ఈ విషయంపై స్పందించాలని కోరినప్పు డు.. చంద్రబాబు ఏబాధ్యత అప్పగించినా.. తను నెరవేరుస్తానని చెప్పారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతోపాటు.. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఒకవేళ బీసీలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే.. ఈమెను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.