• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీ ప్రమాణస్వీకారానికి...

మోడీ ప్రమాణస్వీకారానికి ఎంతటి అసాధారణ భద్రత అంటే?

| ఈ రోజు సాయంత్రం నిర్వహించే మోడీ పట్టాభిషేక కార్యక్రమం జీ20 సదస్సు వేళ కల్పించిన భద్రతను తలపించేలా ఉందని చెబుతున్నారు. 500

By - Tupaki Desk
Update: 2024-06-09 06:12 GMT

ముచ్చటగా మూడోసారి.. హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ఈ సాయంత్రం 7.15 గంటలకు(ఆదివారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమానికి సిద్ధంచేసిన భద్రతా చర్యలు అసాధారణమని వ్యాఖ్యానిస్తున్నారు. జీ20 తర్వాత ఇంత భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది ఇప్పుడేనని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు దక్షిణాసియా దేశాధినేతలు మోడీ ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీకి చేరుకున్నారు.

మోడీ ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ను సిద్ధం చేశారు. ప్రమాణస్వీకార వేదిక పరిసరాల్లో ప్రైవేటు డ్రోన్ల సంచారాన్ని పూర్తిగా నిషేధించారు. అంతే కాదు.. ఢిల్లీ మహానగరం మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. హైఅలెర్టు ప్రకటించారు. జూన్ 9, 10 రెండు రోజులు ఢిల్లీలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డులు.. షార్ప్ షూటర్లు రంగంలోకి దిగారు. ఈ రోజు సాయంత్రం నిర్వహించే మోడీ పట్టాభిషేక కార్యక్రమం జీ20 సదస్సు వేళ కల్పించిన భద్రతను తలపించేలా ఉందని చెబుతున్నారు. 500 సీసీ కెమెరాలతో ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఢిల్లీలో పలు దేశాల అధినేతలు బస చేసిన హోటళ్లను అణువణువూ శోధించారు. పూర్తిగా జల్లెడ పట్టారు. దాయాది పాకిస్థాన్ మినహా ఇరుగుపొరుగు దేశాలకు చెందిన అగ్రనేతలు ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా లీలా.. తాజ్.. ఐటీసీ మౌర్య.. క్లారిడ్జెస్.. ఒబేరాయ్ తదితర ఫైవ్ స్టార్ హోటళ్లను కేటాయించారు.

ఎలాంటి పొరపాటు దొర్లకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి తప్పు జరగకుండా ఉండటానికి వీలుగా డేగకళ్లతో పహారా కాస్తున్నారు. మూడు అంచెల భద్రతా వలయాన్నిరాష్ట్రపతి భవన్ వద్దా.. పరిసరాల్లో నిర్మించారు. మొదటి అంచెలో ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలు.. రెండో అంచెలో నేషనల్ గార్డులు.. డ్రోన్లు.. మూడో అంచెలో స్నీపర్ (స్వాట్ స్పెషల్ వెపన్స్ అండ్ ట్యాక్టిక్స్) టీంలతో మొహరించారు.

రాష్ట్రపతి భవన్ లోపల ఇలాంటి పరిస్థితి ఉంటే.. బయట ప్రాంతాన్ని ఎన్ ఎస్ జే.. స్వాట్ టీంలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రమాణస్వీకారోత్సవానికి అతిధులుగా వచ్చిన వివిద దేశాధినేతలు బస చేసిన హోటల్ నుంచి రాష్ట్రపతి భవన్ కు ఎలా వెళ్లాలి? ఎలా తిరిగి రావాలి? లాంటి అంశాలకు సంబంధించి నిర్దుష్ట ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకోసం 2500 మంది పోలీసుల్నిమొహరించారు. ఢిల్లీలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల పహరా చేపట్టారు.

Tags:    
  • Indianprimeminister 
  • Narendramodi 
  • Highlevelsecurity 
  • Rashtrapatibhavan 
  • Delhi 
  • Oath 
  • Politicalnews 

Similar News

దమ్ము చూపిన జక్కంపూడి రాజా.. స్టేట్ లోనే రికార్డు

2026-11-07 14:12 GMT

అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. అసలేంటి కథ? ఎందుకిలా?

2026-11-07 14:09 GMT

ఇందిర ఎమర్జెన్సీ మీద సోనియా షాకింగ్ కామెంట్స్ !

2026-11-07 14:09 GMT

ఎవరికి ఎన్ని సీట్లు? జిల్లాల వారీగా గెలుపు లెక్కలు

2026-11-07 14:08 GMT

లోకల్ రిజల్ట్ : జనాలకు ఇంట్రెస్ట్ తగ్గిందా ?

2026-11-07 14:07 GMT

మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆరాటం.. ఆర్టీఐతో పోరాటం..ఇదో సాధారణ బ్రేకప్ స్టోరీ కాదు సామీ

2026-11-07 14:05 GMT

ఆధునిక రాజకీయ శకం...వందేళ్ళ అద్వానీకి వందనం

2026-11-07 14:03 GMT

ఓబీసీ క్రీమీలేయ‌ర్‌.. మ‌రింత క‌ఠిన‌మా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది!

2026-11-07 13:45 GMT

షర్మిల ఓవర్ కాన్ఫిడెన్స్

2026-11-07 11:50 GMT

జెడ్పీ పీఠాల వాటాలు...కూటమిలో లెక్క సెట్ అయిందా ?

2026-11-07 11:49 GMT

ఇరాన్ ను కొట్టలేక.. పాపం అమెరికాకు ఎంత గతి పట్టింది?

2026-11-07 11:40 GMT

ఎన్నికల్లో విజయం.. ఎంపీటీసీ గెలుపు చూడకుండానే మరణం.. ఎంత దురదృష్టం..

2026-11-07 11:25 GMT

Copyright @2026

Powered by Blink CMS