మంత్రి రిక్వెస్టు చేసుకున్నారా ?

ఎందుకంటే సంప్రదాయంగా చిలకలూరిపేట నియోజకవర్గం కమ్మ సామాజికవర్గానికి పట్టున్న సీటు.

Update: 2024-01-30 11:30 GMT

మంత్రి విడదల రజని తనకు నియోజకవర్గాన్ని మార్చాలని జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్టు చేసుకున్నారా ? పార్టీవర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. మంత్రి ప్రస్తుతం చిలకలూరిపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీచేసిన మొదటిసారే 8 వేల ఓట్ల మెజారిటితో టీడీపీ సీనియర్ తమ్ముడు ప్రత్తిపాటి పుల్లారావుపై గలిచారు. పుల్లారావుపై రజని గెలవటం అప్పట్లో పెద్ద సంచలనం. ఎందుకంటే సంప్రదాయంగా చిలకలూరిపేట నియోజకవర్గం కమ్మ సామాజికవర్గానికి పట్టున్న సీటు.


ఇక్కడ నుండి ఎవరు గెలిచినా మ్యాగ్జిమమ్ కమ్మ సామాజికవర్గంలోని నేతలే గెలిచారు. అలాంటిది జిల్లాలోని కమ్మ ప్రముఖుల్లో ఒకరు, ఆర్ధికంగా, అంగబలం పుష్కలంగా ఉన్న పుల్లారావును చేనేత సామాజికవర్గానికి చెందిన రజని ఓడించటం అప్పట్లో ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. ఎందుకింత ఆశ్చర్యం అంటే వైసీపీ ఇన్చార్జిగా ఉన్నమర్రి రాజశేఖర్ ను కాదని జగన్మోహన్ రెడ్డి అమెరికా నుండి దిగొచ్చిన రజనీకి అవకాశం ఇచ్చారు కాబట్టే. ఆమెకూడా అమెరికా నుండి రాగానే ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది టీడీపీలోనే.

Read more!

అయితే పుల్లారావును కాదని తనకు టికెట్ దక్కదని తెలుసుకున్న వెంటనే జగన్ను కలిసి వైసీపీలో చేరారు. అప్పట్లో నాటకీయ పరిణామాలన్నీ చాలా స్పీడుగా జరిగిపోయాయి. అందుకనే రజని గెలుపు కలకలం రేపింది. సరే ఇపుడు పరిస్ధితి ఏమిటంటే గెలిచిన దగ్గర నుండి ఆమె నేతల్లో చాలామందితో వివాదాలు పెట్టుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా చాలామందే ఏకమయ్యారు. దాంతో మళ్ళీ ఆమెకు పేటలోనే టికెట్ ఇస్తే గెలవటం కష్టమని గ్రహించిన జగన్ గుంటూరు వెస్ట్ కు మార్చారు.

ఆమెకు కూడా మారు మాట్లాడకుండా గుంటూరుకు వెళ్ళి పార్టీ ఆపీసు ఓపెన్ చేసుకున్నారు. అయితే కొద్దిరోజుల్లోనే తాను ఇక్కడ నిలవలేనని మంత్రికి అనిపించిందట. ఎందుకంటే గుంటూరు వెస్ట్ లోని గ్రూపులను తట్టుకుని గెలవటం కష్టమని అర్ధమైందని పార్టీలో టాక్. అందుకనే జగన్ను కలిసి తనకు మళ్ళీ చిలకలూరిపేటలోనే టికెట్ ఇవ్వాలని రిక్వెస్టు చేసుకున్నట్లు తెలిసింది. మరి జగన్ ఏమంటారో చూడాలి. ఒకవేళ జగన్ కాదంటే రజని ఏమిచేస్తారో చూడాలి.

4

Tags:    

Similar News