పీసీసీ చీఫ్ రేసులో హర్ష కుమార్ ?

ఏపీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేత అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

Update: 2026-08-14 03:47 GMT

ఏపీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేత అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఆయన యువజన కాంగ్రెస్ నుంచి పార్టీలో ఉన్నారు. 1984 ఎన్నికల్లోనే తొలిసారి పోటీ చేసిన హర్ష కుమార్ తన రాజకీయ జీవితంలో రెండు సార్లు ఎంపీ అయ్యారు. 2004, 2009లలో ఆయన కాంగ్రెస్ తరఫున అమలాపురం పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆయన పార్టీలో కూడా కీలక పదవులు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇపుడు ఆయన చూపు ఏపీసీసీ ప్రెసిడెంట్ పదవి మీద ఉందని అంటున్నారు.

ఖాళీగా ఉందా :

పీసీసీ చీఫ్ గా ప్రస్తుతం వైఎస్ షర్మిల ఉన్నారు. ఆమె 2024 జనవరి 18న ఈ బాధ్యతలు స్వీకరించారు. గత రెండున్నరేళ్ళుగా ఆమె ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆమెని ఈ పదవికి ఎంపిక చేయడానికి కారణం వైఎస్సార్ కుమార్తె అన్న కారణం అని అంటున్నారు. అలాగే వైఎస్ జగన్ ఆ సమయంలో ఏపీ సీఎం గా ఉన్నారు. ఆయనకు ఎదురుగా చెల్లెలుని నిలిపి రాజకీయ సమరంలో సెంటిమెంట్ ని రగిల్చాలన్న కాంగ్రెస్ ప్రయత్నం అయితే కూటమి విజయానికి ఎంతో కొంత ఉపయోగపడింది. షర్మిల వల్ల కాంగ్రెస్ అయితే ఏ మాత్రం పుంజుకోలేదని వచ్చిన ఓట్ల షేర్ తెలియచేసింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే పార్టీ కూడా గతంతో పోలిస్తే కొంత నిస్తేజం అయింది అని కూడా అంటున్నారు. అయినా సరే షర్మిల ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ ఇస్తారా లేదా అన్నది అయితే హైకమాండ్ ఇప్పటిదాకా ఆలోచించలేదని అంటున్నారు.

అక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ తో :

ఇక కాంగ్రెస్ జాతీయ స్థాయిలో పుంజుకుంటోంది. మోడీ ప్రభుత్వం మీద ధీటుగా పోరాటం చేస్తోంది. రాహుల్ గాంధీ అయితే పూర్తి సీరియస్ గానే పార్టీ మీద ఫోకస్ పెడుతున్నారు. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోవడంలేదు, బలమైన ఎన్డీయే ప్రభుత్వాన్ని ఆయన ఢీ కొంటూ కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సహాం కలిగిస్తున్నారు. ఇక యువతలో వస్తున్న మార్పులు వివిధ వర్గాలలో పెరుగుతున్న అసంతృప్తి మీద కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మరో వైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడితే ఆ ప్రభావం కచ్చితంగా ఏపీలో కూడా ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు పలువురు ఆలోచిస్తున్నారు. దాంతో పీసీసీ మార్పు కూడా ఉంటుందని వార్తల నేపథ్యంలో ఈ పదవి మీద ఇపుడు కీలక నేతల చూపు పడింది అని అంటున్నారు.

ఖర్గే సారధ్యంలో :

జాతీయ స్థాయిలో మల్లికార్జున ఖర్గె కాంగ్రెస్ కి అధ్యక్ష పదవిలో ఉన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయనకు పెద్ద పీట వేసింది కాంగ్రెస్. దాంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బలోపేతం అయ్యే దిశగా తీసుకున్న కీలక చర్యగా భావిస్తున్నారు. ఏపీలో కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వెనక్కి రావాలన్నా పార్టీ పుంజుకోవాలన్నా దళిత సామాజిక వర్గానికి పెద్ద పీట వేయాల్సి ఉందని అంటున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన హర్ష కుమార్ ఈ నేపధ్యంలోనే పీసీసీ చీఫ్ పదవికి ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు. దూకుడుగా రాజకీయం చేసే హర్ష కుమార్ కి ఈ పదవి కట్టబెడితే కోస్తా జిల్లాలలో కాంగ్రెస్ పుంజుకోవడమే కాకుండా వైసీపీ నుంచి ఓటు బ్యాంక్ ని వెనక్కి ఎంతో కొంత తెచ్చే చాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. విభజన తరువాత పీసీసీ చీఫ్ పదవి అగ్ర వర్ణాలకు అలాగే బీసీలకు దక్కింది. మరి తొలిసారిగా దళిత వర్గాలకు ఇవ్వాలన్న డిమాండ్ అయితే ఉంది. చూడాలి మరి హైకమాండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో.

Tags:    

Similar News