• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సిద్దిపేటలో అర్ధరాత్రి...

సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా.. హరీశ్ ఇంటి దగ్గర అలా!

| ఈ ఉదంతంపై తాజాగా హరీశ్ రావు స్పందించారు. తన అధికారిక నివాసంపై అర్థరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి.. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారన్నారు.

By - Tupaki Desk
Update: 2024-08-17 04:45 GMT

రైతులకు రుణమాఫీ ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిందన్న వాదనను వినిపిస్తున్న మాజీ మంత్రి హరీశ్ పై కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సవాలులో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి రావటంతో.. ఈ అంశం నుంచి తప్పించుకోవటానికి హరీశ్ రావు లేని నిందల్ని రేవంత్ సర్కారు మీద వేస్తున్నట్లుగా చెబుతున్నారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తే.. చేయలేరని.. అలా చేసిన పక్షంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని హరీశ్ సవాలు విసిరారు.

అయితే.. రైతు రుణమాఫీని తాము చెప్పినట్లే పూర్తి చేశామని.. హరీశ్ రావు రాజీనామానే మిగిలిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం.. దీనిపై హరీశ్ తీవ్రంగా రియాక్టు కావటం తెలిసిందే. రుణమాఫీ అమలు చేయకుండానే అమలు చేశారని ఎలా చెబుతారని.. ఇలాంటి ముఖ్యమంత్రిని తామెప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ఇలా మాటల యుద్ధానికి ఫ్లెక్సీయుద్ధం తోడైంది. గడువు లోపు రైతు రుణమాఫీ అమలు చేయటం పూర్తైందని.. హరీశ్ రావు రాజీనామానే మిగిలి ఉందంటూ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.

ఇదిలా ఉంటే.. శుక్రవారం అర్థరాత్రి వేళ సిద్ధిపేటలోని హరీశ్ రావు క్యాంప్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. ఎమ్మెల్యే పదవికి హరీశ్ రావు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.దీంతో.. బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో.. హరీశ్ రావు క్యాంప్ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు చించేశారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ఉదంతంపై తాజాగా హరీశ్ రావు స్పందించారు. తన అధికారిక నివాసంపై అర్థరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి.. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారన్నారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులకు రక్షణ కల్పించారన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని ప్రశనించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని, ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కీలక అంశాల్లో సవాలు విసరటం.. ఆ తర్వాత దాన్ని పట్టించుకోని హరీశ్ రావు.. ఈసారి అందుకు భిన్నమైన అనుభవం ఎదురవుతుందన్న వాదన వినిపిస్తోంది.

Congress goons attack on the Siddipet MLA’s official residence at midnight is an alarming display of lawlessness. Breaking locks and vandalizing property in such manner is not only undemocratic but also raises serious concerns.The police, rather than intervening to prevent this… pic.twitter.com/uvSABsumQu

— Harish Rao Thanneeru (@BRSHarish) August 17, 2024
Tags:    
  • Telangana 
  • Brsparty 
  • Harishrao 
  • Siddipet 
  • Campoffice 
  • Congressparty 
  • Revanthreddy 
  • Flex 
  • Politicalnews 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS