510 కేజీలు అవలీలగా ఎత్తిన హాలీవుడ్ స్టార్... డైట్ ఏంటో తెలుసా?
ఇక ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి స్టార్ హీరోలు, డైరెక్టర్లు కూడా ఫిట్ నెస్ మీద చాలా శ్రద్ధ చూపుతున్నారు.;
సినీ నటులు తెర మీదే కాకుండా వారికంటూ ప్రత్యేకంగా కొన్ని అభిరుచులు ఉంటాయి. మెజార్టీ సినీ స్టార్లు, యాక్టర్లు నటనతో పాటు ఫొటోగ్రఫీ, మ్యూజిక్, హార్స్ రైడింగ్, విదేశీ యాత్రలు, ఇలా ఏదో ఒక ప్రత్యేక అభిరుచి కలిగి ఉంటారు. ఇక సినీ స్టార్ల గురించి అభిమానులతో సాధారణ ప్రేక్షకులు వ్యక్తిగత అభిరుచులు ఇతర వ్యాపకాల గురించి మరింత ఆసక్తి చూపిస్తుంటారు. ఇక మన తెలుగు సినీ నటులతో పాటు సౌత్, బాలీవుడ్ స్టార్లు కూడా యాక్టింగ్ తో పాటు కొన్ని ప్రత్యేక అభిరుచులు కలిగి ఉన్నారు.
ఫిట్‌నెస్ పైనే దృష్టి..
ఇక ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి స్టార్ హీరోలు, డైరెక్టర్లు కూడా ఫిట్ నెస్ మీద చాలా శ్రద్ధ చూపుతున్నారు. తెరమీద అందంగా కనిపించేందుకు తమ శరీర సౌష్టవాన్ని మరింత ఆకర్షణీయంగా, ఫిట్ గా ఉండేందుకు గంటల తరబడి జిమ్ లో చెమటోడుస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు.
ప్రపంచ రికార్డు సృష్టించిన హాలీవుడ్ స్టార్
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఫాంటసీ వెబ్ సిరీస్‌లలో ఒకటైన గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో గ్రెగర్ క్లెగేన్ అలియాస్ 'ది మౌంటైన్' పాత్రతో ప్రేక్షకులను అలరించారు హాఫ్థోర్ బ్జోర్న్సన్. ఈ హాలీవుడ్ హీరో ఎవరూ ఊహించలేని ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. డెడ్‌లిఫ్ట్‌లో ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. ఐస్లాండ్‌కు చెందిన ఈ నటుడు-అథ్లెట్ బర్మింగ్‌హామ్‌లో జరిగిన స్ట్రాంగ్‌మ్యాన్ 2025 పోటీలో 510 కిలోల (1124 పౌండ్లు) భారీ బరువున ఎత్తి, తన గత రికార్డు (505 కిలోలు-1113 పౌండ్లు)ను బద్దలు కొట్టాడు. ఈ క్రీడకు బ్జోర్న్సన్ కొత్తేమీ కాదు. బరువులు ఎత్తడంలో గతంలో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.
వరల్డ్ స్త్రొంగెస్త్ మ్యాన్ ఈ స్టార్
గతంలో కారును అవలీలగా ఎత్తాడు. అలాగే విమానాన్ని సైతం లాగాడు. 2018లో 505 కిలోల డెడ్‌లిఫ్ట్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యక్తి బిరుదు పొందాడు. అత్యంత భారీ బరువును అవలీలగా ఎత్తాడు. ఏదో చిన్న పిల్లాడు ఆడుకున్నంత సులువుగా 510 కిలోల బరువు ఎత్తడాన్ని మనం చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నది.
హాఫ్థోర్ బ్జోర్న్సన్ డైట్ ఇదే..
పోటీ జరిగిన రోజు ఉదయం షేర్ చేసిన వీడియోలో, ది మౌంటైన్ తన డైట్, బ్రేక్ ఫాస్ట్ గురించి వెల్లడించారు. తన ఆహారంలో చిలగడ దుంపలు, బంగాళాదుంపలు, గుడ్లు, రైస్, గ్రీక్ యోగర్ట్, బ్లూబెర్రీస్‌తో ఓట్ మీల్, నారింజ తన డైట్ లో భాగమని చెప్పాడు. పోటీ రోజున తన డైట్ లో మార్పు ఉండదన్నారు. అయితే కచ్చితంగా డైట్ తీసుకునే విషయంలో మాత్రం టైమ్ పాటిస్తానని చెప్పుకొచ్చాడు.