మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదికి పాక్ భద్రత...అడ్డంగా దొరికిందిగా !

ఇక హఫీజ్ సయీద్ ఏమీ రహస్యంగా ఉండడం లేదు ఆయన పంజాబ్ రాజధాని లాహోర్ లోని రద్దీగా ఉండే ఏరియా జనంతో ఉండే చోట నివస్తున్నాడు.;

Update: 2025-04-30 16:31 GMT

నేనేమి ఎరుగ నాకేమి తెలియదు అని పాకిస్తాన్ నంగనాచిగా బుకాయించవచ్చు గాక. కానీ టెక్నాలజీ బాగా పెరిగిన ప్రస్తుత నేపథ్యంలో పాక్ తెర వెనక ఏమి చేసినా కాస్తా ఆలస్యంగా అయినా తెలిసిపోతుంది. ఇపుడు అదే జరుగుతోంది. కాశ్మీర్లోని పహల్గాం ఉగ్ర దాడి వెనక లష్కరే తోయీబా చీఫ్ ముంబై దాడుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ హస్తం ఉందని భారత్ గట్టిగా అనుమానిస్తోంది.

ఈ ఉగ్ర దాడికి తామే కారణం అని లష్కరే తోయీబా అనుబంధంగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఘనంగా చాటుకుంది. అయితే దీని వెనక అసలు మూలం హఫీజ్ సయీద్ అని భారత్ నమ్ముతోంది. ఇక తమ దేశంలోని జైలులో హఫీజ్ సయీద్ మగ్గుతున్నాడని ఎన్నో కబుర్లు చెప్పిన పాకిస్థాన్ ఇపుడు ఆయన ఇంటికి ఇరవై నాలుగు గంటలూ కాపలా పెట్టి కంటికి రెప్పలా చూసుకుంటోంది.

ఇక హఫీజ్ సయీద్ ఏమీ రహస్యంగా ఉండడం లేదు ఆయన పంజాబ్ రాజధాని లాహోర్ లోని రద్దీగా ఉండే ఏరియా జనంతో ఉండే చోట నివస్తున్నాడు. మామూలుగా ఆలోచిస్తే కనుక ఉగ్రవాదులు ఎక్కడో మారు మూల ప్రాంతాలలో ఉంటారు. కానీ తన వెనక పాకిస్తానే ఉంది అన్న ధీమాతో కాబోలు హఫీజ్ సయీద్ దర్జాగా జనం మధ్యనే ఉంటున్నాడు.

ఇపుడు భారత్ ఆయన పహల్గాం ఉగ్రదాడి వెనక సూత్రధాని అని అనుమానిస్తున్న నేపథ్యంలో హైలెవెల్ సెక్యూరిటీ ఇచ్చి కాపాడుతోంది. అతని నివాసంలో మసీదు మదర్సాలు ఉన్నాయి. అతగాడి విలాసవంతమైన జీవితం కోసం ఒక ప్రైవేట్ పార్క్ కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. భారత్ అతగాడిని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా గుర్తించింది.

అయితే అతను మాత్రం పాక్ నీడలో హాయిగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. హఫీజ్ ఉన్న భవనం కిందనే ఒక బంకర్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అంటే ఫుల్ సేఫ్ జోన్ లోనే ఉనాడన్న మాట. అతను జైలులో ఉన్నట్లుగా పాక్ చెప్పినవి అన్నీ అబద్ధాలు అని ఉప గ్రహాల చిత్రాల సాక్షిగా వెల్లడి అయింది.

తన ఇంట్లో ఉంటూనే ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న హఫీజ్ సయీద్ కి పాక్ లో ఎంతటి సహకారం ఉందో అర్ధం అవుతోంది అని అంటున్నారు ఇక పోతే హఫీజ్ సన్నిహితుడుగా ఉన్న అబూ ఖతల్ హత్య తరువాత హఫీజ్ కి మరింత కట్టుదిట్టమైన రక్షణను పాక్ ప్రభుత్వం కల్పిస్తోంది. ఇపుడు కాశ్మీర్ ఉగ్రదాడి తరువాత మరింత ఎక్కువగా భద్రతను పెంచింది.

కేవలం భారత్ మాత్రమే కాదు ఐక్యరాజ్యసమితి కూడా హఫీజ్ ని అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించినా పాక్ అతన్ని జాగ్రత్తగా కాపాడుతోంది అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. అమెరికా కూడా అతడి తలకు వెల కట్టి 10 మిలియన్ డాలర్ల రివార్డుని ప్రకటించింది. ఇక చూస్తే కనుక పాక్ అతనికి కల్పిస్తున్న రక్షణ ఆయన నివాసం ఉన్న భవనం ఇవన్నీ ఉప గ్రహం చాయా చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చాయి.

Tags:    

Similar News