జ్ఞానేష్ ఎఫెక్ట్‌: 650 మందిపై క్రిమిన‌ల్ కేసులు

ఈ క్ర‌మంలోనే పోలీసులు మూడు ఎఫ్ ఐఆర్‌లు న‌మోదు చేశారు. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌లు తెలిపేందుకు అనుమ‌తి లేద‌ని.. ముందుగానే ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించామ‌ని పోలీసులు చెబుతున్నారు.

Update: 2026-10-04 03:48 GMT

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా 650 మందిపై ఢిల్లీ పోలీసులు క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసేందుకురెడీ అయ్యారు. మూడు ఎఫ్ ఐఆర్‌లు న‌మోదు చేశారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల‌న్న డిమాండ్‌తో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు స‌హా క‌మ్యూనిస్టులు.. శుక్ర‌వారం దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద పోలీసులు భారీగా నిర్బంధాలు విధించినా నిర‌స‌న కారులు పోటెత్తారు. ఈ నేప‌థ్యంలో లాఠీ చార్జ్ కూడా జ‌రిగింది.

ఈ క్ర‌మంలోనే పోలీసులు మూడు ఎఫ్ ఐఆర్‌లు న‌మోదు చేశారు. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌లు తెలిపేందుకు అనుమ‌తి లేద‌ని.. ముందుగానే ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించామ‌ని పోలీసులు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. చ‌ట్టాల‌ను ఉల్లంఘించి జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కు యువ‌త దూసుకువ‌చ్చార‌ని పేర్కొన్నారు. ఇది శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే కుట్రేన‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే మూడు ఎఫ్ ఐఆర్‌లు న‌మోదు చేశామ‌ని చెప్పారు. దీనిలో కీల‌క సూత్ర‌ధారుల‌ను కూడా చేర్చ‌నున్న‌ట్టు చెప్పారు.

సుప్రీం ఆదేశాల‌తో..

మ‌రోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు గ‌తంలో నీట్ ప‌రీక్ష లీక్‌కు సంబంధించి జ‌రిగిన ఆందోళ‌న‌పై క‌మిటీ విచార‌ణ ప్రారంభించింది. అప్ప‌ట్లోనూ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌లు తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో పోలీసులు త‌మ‌పై పెల్లెట్లు ప్ర‌యోగించార‌ని.. క‌ర్ర‌ల‌తో కొట్టార‌ని.. యూనిఫాం సైతం వేసుకోకుండానే త‌మ‌కు ఇబ్బందులు క‌లిగించార‌ని విద్యార్థులు సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ నేప‌థ్యంలో కోర్టు.. విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ క‌మిటీ తాజాగా శ‌నివారం ఢిల్లీ పోలీసు స్టేష‌న్‌కుచేరుకుని విచార‌ణ ప్రారంభించింది.

త‌గ్గేది లేదు..

తాజాగా ఢిల్లీ పోలీసులు న‌మోదు చేసిన‌.. మూడు ఎఫ్ ఐఆర్ ల‌పై కాక్రోచ్ జ‌న‌తాపార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే స్పందిం చారు. ప్ర‌జాస్వామ్యంలో శాంతియుత నిర‌స‌లు ఒక హ‌క్కు అని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు ఎవ‌రి చెప్పుచేతుల్లో ఉన్నారో అంద‌రికీ తెలుసున‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటివి ఎన్ని న‌మోదు చేసినా.. త‌మ ఉద్య‌మం ఆగ‌బోద‌న్నారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు.

Tags:    

Similar News