వీరిది పట్టు.. వారిది బెట్టు.. జ్ఞానేష్ గమ్యం ఏంటి?
ఇదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెన్సులో పడేసింది. ఆత్మ రక్షణలో భాగంగా.. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమా లను, నిరసనలను పట్టీపట్టనట్టుగానే వ్యవహరిస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గమ్యం ఏంటి? ఆయన ఎలాంటినిర్ణయం తీసుకుంటా రు?... ఆయన సంగతి ఎలా ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం జ్ఞానేష్ విషయంలో ఎలాంటి దిశగాముందుకు సాగుతుంది? ఇదీ.. ఇప్పుడు జాతీయస్థాయిలో జరుగుతున్న చర్చ. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతున్న విపక్షాల కాంగ్రెస్ కూటమి ఒకవైపు.. స్వతంత్ర ఉద్యమ సంస్థ కాక్రోచ్ జనతా పార్టీ మరోవైపు.. తమ ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తున్నారు.
ఇప్పటికే ముంబై, ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమి సహా కాక్రోచ్ జనతా పార్టీలు ఉద్యమించాయి. శుక్రవారం రోజు రోజంతా ఢిల్లీ, ముంబై నగరాలు అట్టుడికాయి. వందలాది మందిని పోలీ సులు అరెస్టు చేశారు. లాఠీ చార్జ్ చేశారు. మొత్తంగా జ్ఞానేష్ కుమార్‌తో రాజీనామా చేయించాలన్నది ప్రతిపక్షాల వ్యూహం. దీంతో పట్టుదలతోనే ముందుకు సాగుతున్నారు. ఇదే జరిగితే.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్నికల కమిషనర్లను నియమించే సంఘం తీసుకున్న నిర్ణయానికి పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.
ఇదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెన్సులో పడేసింది. ఆత్మ రక్షణలో భాగంగా.. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమా లను, నిరసనలను పట్టీపట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. అయితే.. మరోవైపు ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని కూడా కేంద్రం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ప్రజల్లో కనుక జ్ఞానేష్‌పై వ్యతిరేకత పెరుగుతున్నట్టుగా భావిస్తే.. అప్పుడు కేంద్రం దిగిరాక తప్పదు. దీంతో జ్ఞానేష్‌ను రాజీనామా దిశగా ప్రోత్సహించే అవకాశం ఉంది. అయితే.. అప్పటి వరకు విపక్షాలు వేచిచూసే ధోరణిలో లేవు.
ఇప్పటికే.. సుప్రీంకోర్టులో జ్ఞానేష్ కుమార్‌ను విచారించాలని.. కోరుతూ న్యాయవాది ఒకరు పిటిషన్ వేశారు. సోమవారం దీనిపై విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌లో ఇంప్లీడ్ అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా మరో పిటిషన్ వేసింది. దీనికి సుప్రీం ఓకే అంటే కేసు మరింత ముదరనుంది. ఇక, మరోవైపు.. పార్లమెంటు సమావేశాలు ఇంకా ప్రోరోగ్ కాలేదు. అంటే.. ఏక్షణమైనా పార్లమెంటు సమావేశం జరగొచ్చు.
దీంతో పార్లమెంటులో జ్ఞానేష్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మొత్తంగా.. పట్టుద లతో కాంగ్రెస్ కూటమి ముందుకు సాగుతుంటే.. తాము తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండడం.. జ్ఞానేష్‌ను కాపాడుకునే దిశగా కేంద్రం బెట్టు చేస్తోంది. చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.