చిరుత నుంచి మాజీ క్రికెటర్ ను కాపాడిన కుక్క.. పోరాటానికి సలాం

కుక్కకు విశ్వాసం ఎక్కువ. నక్కకు తెలివి ఎక్కువ అంటారు. పిడికెడు మెతుకులు వేస్తే శునకం ఎంతో నమ్మకంగా ఇంటికి కాపలా ఉంటుంది

Update: 2024-04-26 01:30 GMT

కుక్కకు విశ్వాసం ఎక్కువ. నక్కకు తెలివి ఎక్కువ అంటారు. పిడికెడు మెతుకులు వేస్తే శునకం ఎంతో నమ్మకంగా ఇంటికి కాపలా ఉంటుంది. ఎవరైనా అపరిచితులు వస్తే అరుస్తూ యజమానికి తెలియజేస్తుంది. ఇంటిని ఎల్లవేళలా కాపాడుతుంది. కొన్ని సంఘటనల్లో మన ప్రాణాలు కాపాడటంలో ముందుంటుంది. తాను ప్రాణాలు కోల్పోయినా తనను నమ్ముకున్న వారికి ఎలాంటి నష్టం కలిగించొద్దనేది దాని భక్తి. అందుకే ఇళ్లల్లో చాలా మంది కుక్కలను పెంచుకోవడం సహజం.

ఈ నేపథ్యంలో జింబాబ్వే మాజీ క్రికెటర్ గై నిట్టాల్ ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. ఇటీవల హ్యూమని ప్రాంతంలో ట్రెక్కింగ్ కు తన కుక్కత వెళ్లాడు. అక్కడ పర్వతారోహణ చేసే క్రమంలో అకస్మాత్తుగా ఓ చిరుత తారసపడింది. అతడిపై దాడికి తెగబడింది. దీంతో అతడి పెంపుడు జంతువు కుక్క చిరుతను అడ్డగించింది. దానిపై వీరోచితంగా పోరాడింది. దీంతో అతడికి, కుక్కకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని కుక్కను ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం అతడి, కుక్క ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. తీవ్ర గాయాలపాలైన నిట్టాల్ కు శస్ర్త చికిత్స జరుగుతోంది. ఈ మేరకు అతడి భార్య సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విషయాలు వెల్లడించింది. గతంలో కూడా అతడికి ఇలాంటి ప్రమాదం ఏర్పడితే అదే కుక్క రక్షించిందట. ఇలా పెంపుడు జంతువు అతడి ప్రాణాలకు అండగా నిలుస్తోంది.

2013లో నిట్టాల్ ఇంట్లోకి పెద్ద మొసలి చొరబడి మంచం కిందకు చేరింది. ముందే పసిగట్టిన శునకం అతడి ప్రాణాలు కాపాడింది. ఇలా యజమాని ప్రాణాలు నిత్యం కాపాడే శునకం అతడి వద్ద ఉండటం మంచిదే. ఎందుకంటే ప్రతిసారి అతడి ప్రాణాలు కాపాడుతూ రక్షణగా నిలుస్తోంది. అతడి చావును దగ్గరుండి మరీ దూరం చేస్తూ తన ప్రాణాలను ఫణంగా పెట్టడం గమనార్హం.

Tags:    

Similar News