ప్రపంచానికి రెడ్ సిగ్నల్...ఎర్ర సముద్రం కూడా బంద్ ?
గల్ఫ్ యుద్ధం ప్రపంచానికి పెను సవాల్ గా మారింది. ఈ రోజున అది కొద్ది దేశాల మధ్య అభిజాత్యం, అహంకారం, ఆధిపత్యం అన్నీ కలసి గల్ఫ్ యుద్ధానికి తెర తీశాయన్నది తెలిసిందే.;
గల్ఫ్ యుద్ధం ప్రపంచానికి పెను సవాల్ గా మారింది. ఈ రోజున అది కొద్ది దేశాల మధ్య అభిజాత్యం, అహంకారం, ఆధిపత్యం అన్నీ కలసి గల్ఫ్ యుద్ధానికి తెర తీశాయన్నది తెలిసిందే. అయితే ఈ యుద్ధం ఎక్కడో జరుగుతోంది అని అనుకుంటే పొరపాటే అని ప్రపంచానికి చాలా తొందరగానే అర్ధం అయింది. పశ్చిమాసియాలో తీవ్ర సంఘర్షణలు ప్రపంచాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేస్తోంది. యుద్ధానికి నెల రోజులు దాటింది కానీ అంతకంతకు తీవ్రమవుతోంది కానీ ఎక్కడా తగ్గడం లేదు, దాని అంతర్జాతీయ సమాజం ఇబ్బందుల పాలు అవుతోంది.
చమురు కారుతోంది :
ప్రపంచంలో అనేక దేశాలు తమకు కావాల్సిన చమురుని గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటాయి. అయితే ఇపుడు గల్ఫ్ వార్ జరగడంతో దిగుమతులు నిలిచిపోతున్నాయి. దాంతో భారత్ లాంటి పెద్ద దేశాల నుంచి చిన్న దేశాల వరకూ ఇంధనం లేక అవస్థలు పడుతున్నాయి దానికి ప్రధాన కారణం హార్మోజ్ జల సంధి మీద ఇరాన్ ఆధిపత్యం ఉండడమే. పూర్తిగా తన నియంత్రణలో ఉన్న ఈ జలసంధి మర్గాన్ని ఇరాన్ అదుపులో ఉంచుకుంది. దాంతో చమురు దిగుమతుల సరఫరా బాగా తగ్గిపోయింది. అనేక ఆంక్షల నడుమ ఒక్కో నౌక నెమ్మదిగా భారత్ లాంటి దేశాలకు చేరుకుంటున్నాయి. దాంతో సరఫరా గొలుసుకట్టి దెబ్బ తింటోంది. వాస్తవాలు ఇలా ఉంటే ఇపుడు మరో సవాల్ కూడా ప్రపంచాన్ని పలకరించబోతోంది.
ఎర్ర సముద్రం సైతం :
హార్మూజ్ జల సంధి వద్ద ఇరాన్ పట్టు బిగించడంతో మరో మార్గంగా గల్ఫ్ దేశాలకు ఎర్ర సముద్రం ఉంది. అక్కడ నుంచి ఆయిల్ నౌకలు తమ రవాణా సదుపాయాలకు ఆధారపడుతున్నాయి. అయితే ఇపుడు ఎర్ర సముద్రాన్ని కూడా తన నియంత్రణ లోకి తెచ్చుకోవడానికి ఇరాన్ దేశం నుంచి వస్తున్న పూర్తి బలంతో హౌతీలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నుంచి కూడా చమురు రవాణా సాగకూడదని ఇరాన్ పంతంగా ఉంది అని అంటున్నారు. దాంతో తన చెప్పు చేతలలో ఉన్న హౌతీలను ఎర్ర సముద్రం మీదకు దాడికి పురికొల్పుతోందని అంటున్నారు.
అదే కనుక జరిగితే :
మొత్తం ప్రపంచ ఇంధన అవసరాలలో ఇరవై శాతానికి పైగా ఇంధనం హర్మూజ్ జల సంధి నుంచే రవాణా అవుతోంది. ఇపుడు యుద్ధం నేపధ్యంలో అక్కడ ఇబ్బందులు వచ్చాయి. మరో వైపు ఎర్ర సముద్రం నుంచి కూడా ప్రపంచానికి పదిహేను శాతం నుంచి ఇరవై శాతం దాకా చమురు రవాణా అవుతోంది. దాంతో ఎర్ర సముద్రాన్ని సైతం బంధిస్తే కచ్చితంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది అని అంటున్నారు. అది నేరుగా ప్రపంచం ఆర్థిక వ్యవస్థ మీద పెను ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్ కే ముప్పు :
ఈ చమురు రవాణాలో అతి పెద్ద దిగుమతిదారుగా ఉన్న భారత్ లాంటి పెద్ద దేశాలలో ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే భారత్ లో గ్యాస్ ఇబ్బందులు పెరిగాయి. చమురు విషయంలో ప్రస్తుతానికి ఆటంకాలు లేకపోయినా రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు. అయితే ఇపుడు ఎర్ర సముద్రాన్ని హౌతీలు స్వాధీనంలోకి తెచ్చుకుంటే మాత్రం భారత్ పూర్తిగా సంక్షోభంలో పడుతుందని అంటున్నారు ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు అయితే ఆకాశాన్ని తాకుతాయని అంటున్నారు.
ఇరాన్ వ్యూహంతోనే :
ఇరాన్ అమెరికాతోనూ ఇజ్రాయెల్ తోనూ యుద్ధం చేస్తోంది. అదే సమయంలో అమెరికాకు మిత్ర పక్షాలుగా ఉన్నాయని గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఎర్ర సముద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది అని అంటున్నారు. అక్కడ ఉన్న బాబ్ ఎల్-మందేబ్ జలసంధిని తమ నియంత్రణలో పెట్టుకోవాలని ఇరాక్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అని అంటున్నారు. అలా అన్ని వైపుల నుంచి దెబ్బ తీస్తేనే తప్ప తన అస్థిత్వాన్ని కాపాడుకోలేమని ఇరాన్ యుద్ధ నీతిని అమలు చేస్తోంది. ఈ విధంగా ఇరాన్ భయంకరమైన వ్యూహానికి తెర తీస్తున్న క్రమంలో ప్రపమానికే పెను సవాల్ గా మారుతుందని అంటున్నారు. ఒక్కసారిగా ప్రపంచ వ్యాపార వేదిక కుప్ప కూలుతుందని అంటున్నారు.
హౌతీలే పావులుగా :
ఇరాన్ చేతిలో పావులుగా హౌతీలు ఉన్నారు. వారిని ముందు పెట్టి ఎర్ర సముద్రం మీదుగా రవాణా అవుతున్న ఇంధన నౌకల మీద దాడులు చేయించాలని ఇరాన్ చూస్తోంది అని అంతర్జాతీయ వార్తా కధనాలు తెలియచేస్తున్నాయి. అమెరికా మీద గల్ఫ్ దేశాల మీద పట్టు సాధించేందుకు ఎర్ర సముద్రం మీద దాడులకు ఇరాన్ తెగబడాలని చూస్తోంది అని అంటున్నారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది అని అంటున్నారు. ఇప్పటికే హార్మూజ్ జల సంధి ద్వారా తమ ఆంక్షలతో రవాణా అయ్యే నౌకల నుంచి సుంకాలు వసూలు చేస్తున్న ఇరాన్ ఎర్ర సముద్రాన్ని కూడా కంట్రోల్ లో పెట్టుకుని తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది అంటున్నారు ఇదిలా ఉంటే అటు హార్మూజ్ ఇటు ఎర్ర సముద్రం రెండూ కూడా బంద్ అయితే ప్రపంచానికి ఇంధనం రవాణా అయ్యే మార్గాలు మూసుకుని పోతాయని అంటున్నారు. సౌదీ అరేబియా అయితే తమ ఇంధనాన్ని ఎర్ర సముద్రం మీదుగా పంపిస్తోంది.
ఇంధనంతోనే అన్నీ :
ఇంధనం ఈ రోజున అన్నింటి మీద ప్రభావం చూపిస్తుంది. ఇంధన వనరులు కనుక దిగుమతి తగ్గినా లేక అగినా భారత్ లాంటి దేశాలలో ద్రవ్యోల్బనం తీవ్రంగా పెరుగుతుందని రూపాయి విలువ పడిపోతుంది అని అంటున్నారు. అంతే కాదు ప్రతీ వస్తువు మీద ధరలు దారుణంగా పెరిగి భారత్ ఆర్ధిక వ్యవస్థకే దెబ్బ కొడుతుందని అంటున్నారు. ఎందుకంటే భారత్ కి ఎర్ర సముద్రం మీదుగానే ఐరోప తదితర దేశాల నుంచి వ్యాపార వాణిజ్యాలు జరుగుతాయని గుర్తు చేస్తున్నారు.