• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైరల్ వీడియో... 250...

వైరల్ వీడియో... 250 మేకలను వధించి 20 వేల మందికి బిచ్చగాడి విందు!

| "బిచ్చగాడు" సినిమాలో అన్ని ఉన్న ధనవంతుడు తన తల్లిని రక్షించుకోవడం కోసం దీక్ష చేస్తాడు.

By - Tupaki Desk
Update: 2024-11-19 01:30 GMT

"బిచ్చగాడు" సినిమాలో అన్ని ఉన్న ధనవంతుడు తన తల్లిని రక్షించుకోవడం కోసం దీక్ష చేస్తాడు. ఇందులో భాగంగా... బిక్షమెత్తుకుని బ్రతుకుతాడు! దీనికి పూర్తి భిన్నంగా అన్నట్లుగా ఓ నిజమైన బిచ్చగాడు తన నానమ్మ జ్ఞాపకార్థం రూ.1.25కోట్ల పాకిస్థాన్ రూపాయలతో భారీ విందు ఏర్పాటు చేశాడు. దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... పాకిస్థాన్ లో ఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టి మిట్టాడుతున్న తన దేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి షాకిచ్చినంత పని ఒకటి చేశాడు ఓ బిచ్చగాడు. ఇందులో భాగంగా.. తమ కరెన్సీలో కోటి పాతిక లక్షలు ఖర్చు పెట్టి 20 వేల మందికి పసందైన వంటలతో విందు ఏర్పాటు చేసాడు.

వివరాళ్లోకి వెళ్తే... పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఓ బిచ్చగాడి నానమ్మ ఇటీవల మరణించింది. దీంతో... ఆమె జ్ఞాపకార్థం ఆమె మరణించిన 40వ రోజు ఆ కుటుంబం ఓ భారీ విందును ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా.. గుజ్రాన్ వాలాలో రాహ్ వలీ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.

ఈ విందు కార్యక్రమానికి స్థానికులను ఆహ్వానించింది ఆ కుటుంబం. ఇదే సమయంలో పంజాబ్ ప్రావిన్స్ లోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది అతిథులను ఆహ్వానించింది. ఆ అతిథులు విందు కారక్రమానికి హాజరవ్వడానికి సుమారు 2 వేల వాహనాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రకరకాల పసందైన వంటకాలతో సుమారు 20 వేల మందికి విందు చేసింది.

ఇందులో పాక్ సంప్రదాయ వంటకాలైన సిరి పాయ, మురబ్బాతో పాటు నాన్ వెజ్ తో గ్రాండ్ మెనూను లంచ్ లో వడ్డించగా.. డిన్నర్ లో మటన్, నాన్ మటార్ గంజ్ తో పాటు పలు వంటకాలను వడ్డించారు. ఈ కార్యక్రమం కోసం సుమారు 250 మేకలను వధించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక దీనికి సంబంధించిన వీడియోల కింద... "బిచ్చగాడికి ఇంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందో?" అని ఒకరు కామెంట్ చేస్తే... "పాకిస్థాన్ అప్పుల్లో ఉంది.. ఆ దేశంలోని బిచ్చగాళ్లు కాదు!" అని మరొకరు కామెంట్ చేశారు. మరొకరు... "నేను బిచ్చగాడినే కావొచ్చు.. కానీ పేదవాడ్ని మాత్రం కాదు!" అనే క్యాప్షన్ కరెక్ట్ గా సూటవుతుందని కామెంట్ చేశారు!

Beggars in Gujranwala reportedly spent Rs. 1 crore and 25 lacs on the post funeral ceremony of their grand mother 🤯🤯Thousands of people attended the ceremony. They also made arrangement of all kinds of meal including beef, chicken, matranjan, fruits, sweet dishes 😳😳 pic.twitter.com/Jl59Yzra56

— Ali (@PhupoO_kA_betA) November 17, 2024
Tags:    
  • Beggars 
  • Gujranwalabeggars 
  • Funeralceremony 
  • Beggarsgrandfeast 
  • Beggarfamily 
  • Gujranwalabeggarsparty 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS