నీట్ లో పాస్.. ప్రేమలో పడిందని తండ్రి చంపేశాడు

గుజరాత్ రాష్ట్రంలో ఘోర క్రైం ఉదంతం చోటు చేసుకుంది. పరువు హత్యగా భావిస్తున్న ఈ ఉదంతంలో హత్యకు గురైన అమ్మాయి నీట్ పరీక్షలో పాస్ కావటమే కాదు..;

Update: 2025-08-14 06:16 GMT

గుజరాత్ రాష్ట్రంలో ఘోర క్రైం ఉదంతం చోటు చేసుకుంది. పరువు హత్యగా భావిస్తున్న ఈ ఉదంతంలో హత్యకు గురైన అమ్మాయి నీట్ పరీక్షలో పాస్ కావటమే కాదు.. మంచి మార్కుల్ని సొంతం చేసుకోవటం గమనార్హం. పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడిందన్న కోపంతో తండ్రి.. బాబాయ్ కలిసి చంపేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

గుజరాత్ లోని బనాస్ కాంటా జిల్లాకు చెందిన 18 ఏళ్ల చంద్రిక నీట్ ఎగ్జామ్ కోచింగ్ కోసం పాలన్ పుర్ హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకునేది. ఈ క్రమంలో పెళ్లైన హరేశ్ చౌధరి అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అతడితో సహజీవనం షురూ చేసింది. ఈ వ్యవహారం ఇంట్లో తెలవటంతో పెద్ద గొడవే అయ్యింది. ఆమెను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఒక పాత కేసులో హరీశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతడు జైలుకు వెళ్లాడు.

ఇదిలా ఉండగా.. జైలు నుంచి బయటకు వచ్చిన హరీశ్.. ప్రియురాలు చంద్రిక ఆచూకీ తెలియజేయాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జూన్ 27న విచారణకు రానున్న సందర్భంలో.. 24న చంద్రిక మరణించటం.. ఆవెంటనే గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు జరిగిన వైనం వెలుగు చూసింది.

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం వ్యవహారంపై ఫోకస్ చేశారు. వారు సేకరించిన ప్రాథమిక సమాచారంలోనే చంద్రిక హత్యకు గురైన విషయాన్ని గుర్తించారు. చంద్రికకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారని. ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత తండ్రి.. ఆమె ఇద్దరు బాబాయిలు కలిసి గొంతు నులిమి చంపేసినట్లుగా ఏఎస్పీ సుమన్ నాలా వెల్లడించారు. హరీశ్ ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో కేసు నమోదు చేసిన నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నీట్ ఫలితాల్లో చంద్రిక పాస్ కావటమే కాదు.. మంచి మార్కులు సాధించిన వైనాన్ని పోలీసులు తమ విచారణలో గుర్తించారు.దేశంలోనే అత్యంత కష్టతరమైన పరీక్షల్లో ఒకటైన్ నీట్ ను సక్సెస్ ఫుల్ గా క్రాక్ చేసినప్పటికి.. జీవితంలో మాత్రం తండ్రి.. బాబాయ్ చేతిలోనే హతం కావటం గమనార్హం.

Tags:    

Similar News