దేశంలోనే ధనిక వినాయకుడు.. 69 కేజీల బంగారం.. రూ.475 కోట్ల ఇన్సూరెన్స్.. ఎక్కడంటే?
సాధారణంగా ఇన్సూరెన్స్ అంటే కేవలం మనుషులకు, జంతువులకు, లేదా వాహనాలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది.;
సాధారణంగా ఇన్సూరెన్స్ అంటే కేవలం మనుషులకు, జంతువులకు, లేదా వాహనాలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు తాజాగా గణపతి మండపానికి ఏకంగా కొన్ని కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ కలిగి ఉన్నది.
దేశవ్యాప్తంగా ఈ రోజున గణపతి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు ప్రజలు. ఇప్పటికే గల్లీ గల్లీలలో కూడా వినాయకుడిని ఏర్పాటు చేసి వినాయక చవితిని చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. రకరకాల గణపతి విగ్రహాలను కూడా మనం చూస్తూనే ఉన్నాము. మరి ఆ ఇన్సూరెన్స్ ఏం ప్రాంతంలోని గణపయ్యకి ఉంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం.
పెద్ద పెద్ద నగరాలలో వినాయక చవితిని చాలా గ్రాండ్ గా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ముంబై వంటి ప్రాంతాలలో చాలామంది సెలబ్రిటీలు వెళ్లి మరీ పాల్గొంటూ ఉంటారు. నగరంలోని కింగ్స్ సర్కిల్ జీఎస్బీ సేవా మండలిలో అత్యంత సంపన్న గణపతి మండపముగా పేరు సంపాదించింది. సుమారుగా 70 ఏళ్లుగా ఈ మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితికి ముందు.. ఆ తర్వాత ఐదు రోజుల వరకు గణేష్ ఉత్సవాలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు. అయితే ఈ సీజన్ లో రూ.474.46 కోట్లు విలువైన రికార్డు బీమాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
గత ఏడాది రూ.400 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించి సరికొత్త రికార్డు సృష్టించింది ఈ మండపం. ఇప్పుడు ఆ రికార్డును మరొకసారి బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. బంగారం, వెండి వస్తువుల విలువ పెరగడంతో పాటుగా స్వచ్ఛంద సేవకులు, పూజారులను సైతం అక్కడ చేర్చుకోవడం వల్ల ఈ బీమా కవరేజ్ మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ బీమా ఎలా వర్తిస్తుంది అంటే..? ఆ మండపంలో ఉండే బంగారం, వెండి, ఇతర వస్తువులతోపాటుగా ఆ ఉత్సవాలలో పాల్గొనే వాలంటరీలు, పూజారులతోపాటు పాదరక్షలను భద్రపరిచేవారు, సెక్యూరిటీ సిబ్బంది, పార్కింగ్ సిబ్బంది కూడా ఈ బీమా పరిధిలోకి రావడం గమనార్హం. అంతేకాకుండా నవరాత్రి వేడుకలలో మండపాన్ని దర్శించే ప్రతి భక్తుడికి కూడా ఈ బీమా వర్తిస్తుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.
రూ. 474 కోట్లలో బంగారం, వెండి ఆభరణాలను కవర్ చేసే ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీ విలువ రూ.67 కోట్లు. 2024లో దీని విలువ రూ.43 కోట్లు కాగా.. 2023 లో రూ.38 కోట్లు ఉంది. ఇక రూ.375 కోట్లలో అత్యధిక వాటా వ్యక్తిగత, ప్రమాద బీమా స్వచ్ఛంద సేవకులు, వాలెట్లు, సెక్యూరిటీ గార్డులను కవర్ చేస్తుంది. అగ్నిప్రమాదం భూకంపం ముప్పు వంటి వాటికోసం ప్రత్యేకంగా మరో రెండు కోట్ల రూపాయల బీమా తీసుకున్నట్లు సమాచారం.. ఇక్కడ గణేష్ ఉత్సవాలు దాదాపు ఆగస్టు 27 నుండి ఆగస్టు 31 వరకు ఐదు రోజుల ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఇకపోతే ఈసారి ఈ వినాయకుడిని 69 కిలోల బంగారు ఆభరణాలు, 336 కిలోల వెండితో అలంకరించారు.