రాజా ది గ్రేట్... బీజేపీలోకి ఎమ్మెల్యే ?

బీజేపీ ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. దాని మీద కూడా పార్టీ సమీక్ష నిర్వహిస్తోంది.;

Update: 2026-02-26 06:30 GMT

ఆయన గట్టి నాయకుడు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే. పైగా బీజేపీ ఫిలాసఫీ అయిన హిందూత్వ మీద పూర్తిగా ఫైట్ చేసే ఒక నిఖార్సు అయిన నాయకుడు. అయితే ఆయనకు లోకల్ గా ఉంటే లీడర్లతో వివాదం ఉంది. అది ఆయన ఎక్కడా దాచుకోకుండా మీడియా ముందు మాట్లాడటం చిక్కు తెచ్చి పెట్టింది. దాంతో ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. ఆయనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.

బంధం అలాగే :

చిత్రమేంటి అంటే ఆయన సస్పెన్షన్ జరిగి చాలా కాలం అయినా ఆయన సభ్యత్వం తొలగించాలని స్పీకర్ కి బీజేపీ పెద్దలు ఇప్పటిదాకా లేఖ ఏదీ అధికారికంగా ఇవ్వలేదు. ఆయన బీజేపీ ఎమ్మెల్యేగానే అనధికారికంగా ఉంటున్నారు. ఆయన వాయిస్ కూడా అలాగే వినిపిస్తున్నారు. దాంతో ఆయన మీద బీజేపీ పెద్దలకు మనసు కరిగింది అని అంటున్నారు. ఈ క్రమంలో ఆయనను పార్టీ అధినాయకత్వం సస్పెన్షన్ ఎత్తేసి తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

బలమైన నేతగా :

రాజా సింగ్ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014, 2018, 2023 ఇలా మూడు సార్లు వరుసగా గెలిచారు ఇక 2018లో అయితే బీజేపీ నుంచి గెలిచిన ఏకైక మొనగాడుగా ఉన్నారు. గోషామహల్ అయితే కీలకమైన ప్రాంతం. అక్కడ ఒవైసీల ప్రాబల్యం ఉంటుంది. అలాంటి చోట బీజేపీ తరఫున గెలిచి కంచుకోట చేసిన రాజా సింగ్ కంటే గట్టి నేత తెలంగాణా బీజేపీలో లేరని కూడా అంటున్నారు.

ఓటమి వెనక :

బీజేపీ ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. దాని మీద కూడా పార్టీ సమీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో రాజా సింగ్ వంటి వారు చేసిన కామెంట్స్ ని కూడా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. బీజేపీకి తెలంగాణాలో గట్టి నాయకత్వం కావాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. బలమైన నేతను పెడితేనే పార్టీకి ఊపు వస్తుందని ఆయన సూచిస్తున్నారు. ఇపుడు కేంద్ర నాయకత్వం కూడా ఇవన్నీ చూస్తూ పరిశీలిస్తోంది అని అంటున్నారు.

ఉండాల్సిందే అంటూ :

ఈ నేపథ్యంలో పార్టీ ఫిలాసఫీని నమ్ముకుంటూ వరసగా గెలుస్తూ వస్తున్న రాజా సింగ్ లాంటి నేతలు పార్టీలో ఉండాల్సిందే అని అంటున్నారు. ఈ పరిస్థితులు అన్నీ రాజా సింగ్ కి అనుకూలంగా మారుతున్నాయని అంటున్నారు. ఇక మజ్లీస్ నేతల మీద నేరుగా పదునైన విమర్శలు చేసే సత్తా కూడా రాజా సింగ్ కే ఉందని అంటున్నారు. ఆయన ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా చేస్తున్న విమర్శలు బీజేపీ నేతలకు బూస్టింగ్ ఇస్తున్నాయని చెబుతున్నారు. మొత్తానికి రాజా సింగ్ మీద సస్పెన్షన్ ఎత్తేస్తూ ఒక కీలక ప్రకటన తొందరలోనే వస్తుందని అని ఆయన అనుచరులు అయితే కడు నమ్మకంగా చెబుతున్నారు. అంతే కాదు రానున్న కాలంలో తెలంగాణా బీజేపీలో రాజా సింగ్ కి అధిక ప్రాధాన్యత దక్కుతుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News