• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైరల్... జో బైడెన్ చేసిన...

వైరల్... జో బైడెన్ చేసిన నేరమేమిటి గూగుల్...?

| వివరాల్లోకి వెళ్తే... అమెరికాకు ఈ శతాబ్ధంలో 2001 నుంచి 2009 వరకూ రెండు దఫాలు జార్జ్ డబ్ల్యూ బుష్.. 2009 - 2017 మధ్య రెండు సార్లు బరక్ ఒబామా అమెరికాను పరిపాలించిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-01-23 23:30 GMT

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తాజాగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమెరికా 45వ అధ్యక్షుడిగానూ ట్రంప్ పనిచేశారు. ఈ మధ్యలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. 2021 నుంచి 2025 మధ్య పూర్తి టెర్మ పాలించారు. ఇది చాలా మందికి తెలిసిన విషయమే కానీ.. గూగుల్ మాత్రం మరిచిపోయింది!

అవును... తాజాగా నెట్టింట ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ప్రస్తుతం ట్రంప్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయగా.. అప్పటి వరకూ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నది జోబైడెన్ అనే సంగతి దాదాపు ప్రపంచమంతా తెలుసు! అయితే.. ఈ విషయం గూగుల్ కి తెలియకపోవడమనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే... అమెరికాకు ఈ శతాబ్ధంలో 2001 నుంచి 2009 వరకూ రెండు దఫాలు జార్జ్ డబ్ల్యూ బుష్.. 2009 - 2017 మధ్య రెండు సార్లు బరక్ ఒబామా అమెరికాను పరిపాలించిన సంగతి తెలిసిందే. అనంతరం 2017 - 2021 మధ్య డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ప్రెసిడెంట్ అయ్యారు.. అమెరికాను పాలించారు.

ఈ విషయాలన్నీ కరెక్ట్ గా చెబుతున్న గూగుల్ సెర్చ్... 2021 - 2025 మధ్య జోబైడెన్ యూఎస్ ప్రెసిడెంట్ గా ఉన్న విషయాన్ని మాత్రం మిస్ చేసింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ గుర్తించి, దానికి సంబంధించిన మొబైల్ సెర్చ్ స్క్రీన్ షాట్స్ తీసి, నెట్టింట పోస్ట్ చేశారు. "లిస్ట్ ఆఫ్ యూఎస్ ప్రెసిడెంట్స్ ఇన్ ఆర్డర్" అని సెర్చ్ చేస్తే.. ఆ రిజల్ట్ లో బైడెన్ తప్పిపోయారని పోస్ట్ పెట్టారు.

దీంతో... ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వగానే ఎలాన్ మస్క్ ఎలాంటి విషయం మరిచిపోయినా పర్లేదు.. సంతోషంలో అయ్యి ఉంటుందని సరిపెట్టుకొవచ్చు కానీ.. గూగుల్ కూడా మరిచిపోతే ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే... ఈ విషయం తెరపైకి వచ్చిన కాసేపటి తర్వాత గూగుల్ మేల్కొంది! 2021-2025 మధ్య అమెరికా ప్రెసిడెంట్ ఎవరో వెతికి పెట్టింది!

I rarely use this app, but just because others are talking about this on another app - thought to bring it to this side too. When people are googling who was the US president during the Biden years, the answer doesn’t match. Also, when you google “US presidents in order” 🤔 pic.twitter.com/Mg4RkLpELY

— Carolina (@Mambos_mom) January 23, 2025
Tags:    
  • DonaldTrump 
  • JoeBiden 
  • GoogleMistake 
  • ElonMusk 
  • USPresidents 
  • TrumpBiden 
  • GoogleSearch 
  • SocialMediaBuzz 
  • PresidentList 

Similar News

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

Copyright @2026

Powered by Blink CMS