'గూగుల్ ఇంటర్వ్యూలు'... సుందర్ పిచాయ్ నుంచి కీలక అప్ డేట్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా మారిపోతున్నట్లే.. మోసాలు పెరిగిపోతున్నాయని అంటున్నారు.;

Update: 2025-08-18 04:23 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా మారిపోతున్నట్లే.. మోసాలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా గూగుల్ ఇంటర్వ్యూల్లో మోసాలకూ ఏఐ ఒక సాధనంగా మారిందని చెబుతున్నారు. మరోవైపు ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల్లో 50% కంటే ఎక్కువ మంది ఏఐ సాయంతో మోసం చేస్తున్నారని నివేదిక వెల్లడించింది. ఈ సమయంలో సుందర్ పిచాయ్ నుంచి కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.

అవును.. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల్లో 50% కంటే ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సాయంతో మోసం చేస్తున్నారని నివేదికలు వచ్చిన వేళ సుందర్ పిచాయ్ నుంచి కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. వర్చువల్‌ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు జరుపుతుంటే, నమ్మదగిన వ్యక్తులు సంస్థలోకి రావడం లేదని గూగుల్‌ సీఈఓ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అందువల్ల గూగుల్‌ లో మళ్లీ పర్సనల్ ఇంటర్య్వూలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. ప్రధానంగా... మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులను నిర్ధారించుకోవడంకోసం, అభ్యర్థులను కనీసం ఒక విడత పర్సనల్ ఇంటర్వ్యూలతో పరీక్షించాలని గూగుల్‌ యోచిస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బ్రియాన్‌ ఓంగ్‌.. గూగుల్‌ గతంలో ఆన్‌ లైన్‌ ఇంటర్వ్యూలను ఎందుకు ఇష్టపడిందంటే.. ప్రాథమిక సవాలును ఎదుర్కోవడం ఇష్టం లేకపోవడం వల్లే అని అంగీకరించారు. ఇదే సమయంలో ఈ సమస్య కేవలం గూగుల్‌ కే పరిమితం కాలేదని, పరిశ్రమ వ్యాప్త సంక్షోభంగా మారుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు.

వాస్తవానికి వర్చువల్‌ ఇంటర్వ్యూలు రెండు వారాల పాటు వేగంగా షెడ్యూల్‌ చేయడం సులభమని చెప్పిన ఆయన.. దీంతో శ్రమ, సమయం, వ్యయాలు తగ్గుతాయని పేర్కొన్నారు. అయితే ఆన్‌ లైన్‌ ఇంటర్వ్యూ ప్రక్రియలో ఏఐ ఇప్పుడు ఎలా ప్రభావం ఎక్కువవుతుండటంతో దాన్ని సమగ్రంగా పర్యవేక్షించడానికి కచ్చితంగా ఇంకా ఎక్కువగా దీనిపై పని చేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News