ఆల్ టైం రికార్డ్ సృష్టించిన 22K గోల్డ్!

ఈ మధ్యకాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు సామాన్యులకే కాదు ఇటు వ్యాపారస్తులు కూడా ఈ రేంజ్ లో పెట్టి కొనుగోలు చేయాలి అంటే కాస్త వెనుకడుగు వేస్తున్నారు.;

Update: 2025-09-14 05:11 GMT

ఈ మధ్యకాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు సామాన్యులకే కాదు ఇటు వ్యాపారస్తులు కూడా ఈ రేంజ్ లో పెట్టి కొనుగోలు చేయాలి అంటే కాస్త వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఈ బంగారం ధరలు అనేవి సేఫ్టీ పెట్టుబడి కోసం ఎదురుచూసే వారికి మంచి ఊరట కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ఎవరైతే బంగారంలో పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచిస్తున్నారో అలాంటి వారికి ఇది సరైన సమయం అనడంలో సందేహం లేదు.. ఇకపోతే గత కొంతకాలంగా బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే వస్తున్నాయి.. మరి ఈరోజు కూడా ఆల్ టైం రికార్డ్ సృష్టించింది 22 క్యారెట్ల గోల్డ్. సాధారణంగా ఈ గోల్డ్ బంగారు ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మొన్నటి వరకు కేవలం లక్ష లోపే ఉన్న ఈ విలువ.. ఇప్పుడు 1,4 వేలకు చేరుకోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.

సెప్టెంబర్ 14న ఆదివారం రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే.. ఇండియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్ళీ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,04,140 ధర పలకగా .. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,13,200 చేరుకుంది. ఇకపోతే పెట్టుబడి బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతుండగా.. వీటివెంటే ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం కూడా ధరలు పెరగడంతో సామాన్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బంగారం పెరుగుదలకు అనేక కారణాలు ఉన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం.. డాలర్ విలువతో రూపాయి విలువ బలహీనపడటం, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న నెగిటివిటీ వంటివి ప్రధాన కారణాలు అని నిపుణులు కూడా చెబుతున్నారు. అమెరికాలో వచ్చిన జాబ్స్ డేటా కూడా బలహీనంగా ఉండడంతో వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ పరిస్థితిలో ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులను సేఫ్ ఆస్తుల వైపు తరలిస్తున్నారు.

అందుకే బంగారం ధరలు కూడా అంతకంతకు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. దీనికి తోడు ఇతర దేశాలు కూడా బంగారం నిలువలను పెంచుకుంటున్నాయి. ఇలా భారీ మొత్తంలో బంగారు నిలువలు పెంచుకోవడం వల్ల ధరలు పెరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. ఇక వీటన్నింటిలో మార్పులు వస్తే కచ్చితంగా బంగారం ధరలలో మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి వీటిలో ఎప్పుడు మార్పు కలుగుతుందో చూడాలి.

బంగారం విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరికి కూడా బంగారం అనేది అత్యంత ప్రీతికరమైనది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సందర్భం ఏదైనా సరే బంగారం కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తారు. కానీ ఇలా రోజురోజుకీ బంగారం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ప్రజలకు మరింత కష్టంగా మారిందని చెప్పవచ్చు. పండగ సీజన్ ఉన్నప్పటికీ కూడా ధరల కారణంగా నగల దుకాణాలలో సేల్స్ తగ్గిపోతున్నాయని జువెలరీ వ్యాపారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా బంగారం ధరలు మాత్రం రోజురోజుకీ ప్రజలకు మరింత భారంగా మారుతున్నాయి అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News