శాంతించిన బంగారం ధరలు.. సామాన్యుడికి ఊరట దొరికేనా?

బంగారం.. బంగారం.. బంగారం.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ.. కారణం సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎదిగిపోవడమే అని చెప్పవచ్చు.;

Update: 2025-09-13 05:50 GMT

బంగారం.. బంగారం.. బంగారం.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ.. కారణం సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎదిగిపోవడమే అని చెప్పవచ్చు. ఒకప్పుడు బంగారం ధరలు అందరికీ అందుబాటులో ఉండేవి. చాలామంది తమకు ఇష్టమైన, నచ్చిన ఆభరణాన్ని తయారు చేయించుకొని మరీ ధరించేవారు. కానీ ఇప్పుడు బంగారం అంటేనే భయపడిపోతున్నారు. సాధారణంగా మన భారత దేశంలో ఫంక్షనులకు , పెళ్లిళ్లకు బంగారం తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందే. ఇలాంటి సమయంలో తులం 22 క్యారెట్ల బంగారం ఏకంగా లక్ష రూపాయలు దాటడంతో సామాన్యుడు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో కాస్త సామాన్యుడికి ఊరట కలిగింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా శాంతించిన ఈ బంగారం ధరలు కొంతమేర ఉపశమనం కలిగించాయి అని చెప్పడంలో సందేహం లేదు.

ఇకపోతే ఈరోజు అనగా సెప్టెంబర్ 13వ తేదీ శనివారం బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం ఇప్పుడు ఒకసారి చూద్దాం.

భౌగోళిక, రాజకీయ అనిశ్చిత్తుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులు వైపు మొగ్గుచూపడం వల్లే ఇప్పుడు బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. దీనికి తోడు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ క్రమంగా క్షీణించడం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయానికొస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై ఏకంగా 110 రూపాయలు తగ్గి రూ.1,11,170కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు తగ్గి రూ.1,01,900 కి చేరుకుంది.

బంగారం ధరలలో దాదాపు 100 రూపాయల వరకు తగ్గుదల కనిపించగా అటు వెండిలో మాత్రం ఏకంగా వెయ్యి రూపాయల పెరుగుదల కనిపించి సామాన్యుడికి మరో షాక్ కలిగింది అని చెప్పవచ్చు. నిన్నటి వరకు రూ.1,42,000గా నమోదైన కేజీ వెండి.. ఇప్పుడు ఏకంగా రూ.1000 పెరిగి 1,43,000 కి చేరుకుంది. రెండు రోజుల్లోనే కేజీ సిల్వర్ పై ఏకంగా రూ.3 వేలు పెరగడం గమనార్హం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News