భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు.. ఏకంగా 11,000 తగ్గింపు!
అయితే వెండి ధరలలో ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు.. ఉదయం వెండిపై రూ.5000 తగ్గి ఏకంగా కేజీ సిల్వర్ ధర 1,65,000 చేరుకుంది. ప్రస్తుతం ఈ ధర నిలకడగానే కొనసాగుతోంది.;
గత రెండు మూడు నెలలుగా అమాంతం పెరిగిపోతూ 22 క్యారెట్స్ బంగారం కూడా ఏకంగా లక్ష రూపాయలు దాటి అందరిని ఆశ్చర్యపరిచి. దీంతో సామాన్య ప్రజలు బంగారం కొనడం కాదు కదా కనీసం బంగారం గురించి ఆలోచించడమే మానేశారు. ఇక 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా 1,32,000 వరకు వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలలో తగ్గుదల కనిపిస్తూ ఉండడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా వారం రోజులుగా దిగివస్తున్న బంగారం ధరలను మనం పరిశీలించినట్లయితే.. 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా 11 వేల వరకు తగ్గింపు కనిపిస్తోంది. ఈ తగ్గింపును చూసి ఇటు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మరోవైపు ఈరోజు ఏకంగా రెండుసార్లు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఉదయం బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే..హైదరాబాదు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.820 తగ్గి 1,22,460 కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750 తగ్గి రూ.1,12,250 కి చేరుకుంది. అటు వెండిపై రూ.5000 తగ్గి ఏకంగా కేజీ సిల్వర్ ధర 1,65,000 చేరుకుంది.
అయితే ఈ ధర ఇప్పుడు మళ్లీ మారిపోయింది. మళ్లీ గత కొన్ని గంటల వ్యవధిలోనే రెండోసారి బంగారం ధరలు తగ్గడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రితం నమోదైన బంగారం ధరల విషయానికి వస్తే.. హైదరాబాదు బులియన్ మార్కెట్లో.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,460 తగ్గి రూ.1,20,820 కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,250 తగ్గి రూ.1,10,750గా నమోదు అయ్యింది. అయితే వెండి ధరలలో ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు.. ఉదయం వెండిపై రూ.5000 తగ్గి ఏకంగా కేజీ సిల్వర్ ధర 1,65,000 చేరుకుంది. ప్రస్తుతం ఈ ధర నిలకడగానే కొనసాగుతోంది.
ఇకపోతే 2 నెలలుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు.. ఇప్పుడు మళ్లీ ధరలు తగ్గడానికి గల కారణం ఏమిటి అనే విషయానికొస్తే.. అమెరికా - చైనా దేశాల నేతల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అప్డేట్ బయటకు వెలువడడం .. యూఎస్ డాలర్ బలపడడం వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అటు మార్కెట్లో ఇటు ప్రపంచ భౌగోళిక పరిస్థితులు సురక్షితంగా ఉన్నాయని ప్రజలు భావించినప్పుడే గోల్డ్, సిల్వర్లో తక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు ఫలితంగా ధరలు కూడా తగ్గిపోతాయి. అటు ప్రపంచ దేశాలు కూడా మొన్నటి వరకు బంగారం నిలువలు పెంచుకోవడం వల్లే బంగారం ధర పెరిగిపోయింది..
ఇకపోతే చైనా - అమెరికా మధ్య అప్డేట్ ఏంటి అనే విషయానికి వస్తే.. చైనా - అమెరికా నేతలు మలేషియాలో రెండు రోజులపాటు సమావేశమయ్యారు. ఎక్స్పోర్ట్ రూల్స్, డ్రగ్ ట్రాఫికింగ్ , ఫామ్ ట్రేడ్, షిప్పింగ్ ట్యాక్స్ లు వంటి పెద్ద అంశాలపై వారు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో శుభవార్త ఏమిటంటే.. ఈ పరిస్థితుల్లో ప్రపంచం తక్కువ రిస్క్ లో ఉన్నట్లు భావిస్తోంది. అందుకే అమెరికా చైనా వాణిజ్య ఒప్పందం బలమై.. అమెరికా డాలర్ పాజిటివిటీ తోనే సేఫ్ హెవెన్ డిమాండ్ బలహీన పడింది. అందుకే బంగారం ధరలు తగ్గుతున్నట్లు సమాచారం.