ఉప్పాడ తీరానికి మొంథా పోయే మెరిసే రేణువులు వచ్చే... ఏమా విషయం!
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరం తాజాగా వచ్చిన మొంథా తుపానువల్ల ఎంతో ప్రభావితమైన సంగతి తెలిసిందే. అధికారులు సైతం ఈ ప్రాంతంపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.;
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరం తాజాగా వచ్చిన మొంథా తుపానువల్ల ఎంతో ప్రభావితమైన సంగతి తెలిసిందే. అధికారులు సైతం ఈ ప్రాంతంపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అయితే తాజాగా కాకినాడను తాకిన తుపాను.. ఉప్పాడ సముద్ర తీరానికి బంగారాన్ని మోసుకొచ్చిందనే ప్రచారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో.. స్థానికులతో తీరం నిండిపోయింది!
అవును... కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరం తుఫాను వల్ల ఎంతో ప్రభావితమైన సంగతి తెలిసిందే. అయితే, ఆ తుఫాను ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీరానికి బంగారాన్ని మోసుకొచ్చిందని వార్తలు వైరల్ గా మారాయి. దీంతో ఉప్పాడ సముద్ర తీరానికి స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పరుగులు తీశారు! ఇసుకలో మెరుస్తున్న బంగారు రంగు రేణువులను సేకరించడం మొదలుపెట్టారు.
తుపాను తర్వాత బంగారం దొరుకుతుందని..!:
తుఫాన్ తీరం దాటిన తర్వాత ఉప్పాడ సముద్ర తీర ప్రాంత సమీపంలో బంగారు రేణువులు దొరుకుతాయి అంటూ స్థానికులతోపాటు సమీప గ్రామస్తులు సైతం సముద్రపు ఒడ్డున జల్లింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా... అక్కడ ఉన్న ఇసుకను రాయని రప్పను అక్కడ ప్రజలు జెల్లెడు పట్టి బంగారు రేణువులు సొంతం చేసుకుంటారని అంటున్నారు.
దీని వెనుక 100 ఏళ్ల నాటి కథ...!:
ఆ ప్రాంతానికి తుపాను రావడం ఏమిటి.. సముద్రం ఒడ్డున బంగారు రేణువులు దొరకడం ఏమిటి అనే సందేహం రావొచ్చు! అయితే... దీని వెనుక వందల ఏళ్ల నాటి వ్యవహారం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... వందలాది సంవత్సరాల కిందట ఈ సముద్ర కాలగర్భంలో రాజుల నివాసాలు వారి బంగారు ఆభరణాలు సైతం కలిసిపోయాయని.. ఇలా తుఫాను వచ్చినప్పుడు వాటి రేణువులు బయటకు వస్తాయంటూ చెప్పుకొస్తున్నారు.
కాగా.... తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తుపాను ప్రభావంతో ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వరితో పాటు అన్ని రకాల పంటలకూ అపార నష్టం వాటిల్లింది. ప్రస్తుతం తుపాను తీరం దాటడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.