నాడు అంబానీ.. నేడు గోద్రెజ్‌.. విడిపోతున్న కుటుంబ వ్యాపారాలు!

ఇక‌, ఇప్పుడు 'గోద్రెజ్‌' వంతు వ‌చ్చింది. మ‌హారాష్ట్ర కేంద్రంగా.. 1897లో అర్దేషిర్‌, పిరోజ్‌షా గోద్రెజ్ అన్న‌ద‌మ్ములు స్థాపించిన గోద్రెజ్ కంపెనీ కూడా.. విడిపోయింది.

Update: 2024-05-01 07:21 GMT

అంబానీ సంస్థ‌ల గురించి తెలిసిందే. గ‌త ప‌దేళ్ల కింద‌ట‌.. ఈ సంస్థ‌లు విడిపోయాయి. ధీరూభాయ్ అంబానీ నేతృత్వంలో వ‌చ్చిన‌.. అంబానీ బ్రాండ్‌కు ప్ర‌పంచ ప్ర‌సిద్ది ఉంది. దీనిని ఆయ‌న కుమారులు అనిల్‌, ముఖేష్ అంబానీలు పంచుకున్నారు. త‌ర్వాత‌.. ఒక‌రు డెవ‌ల‌ప్ అయితే.. మ‌రొకరు న‌ష్ట‌పోయారు. ఇక‌, ఇప్పుడు 'గోద్రెజ్‌' వంతు వ‌చ్చింది. మ‌హారాష్ట్ర కేంద్రంగా.. 1897లో అర్దేషిర్‌, పిరోజ్‌షా గోద్రెజ్ అన్న‌ద‌మ్ములు స్థాపించిన గోద్రెజ్ కంపెనీ కూడా.. విడిపోయింది.

అర్దేషిర్‌.. పిరోజ్‌షాలు అన్న‌ద‌మ్ములు. వీరి ఇంటి పేరు గోద్రెజ్‌. ఈ పేరుతోనే.. వారు వ్య‌వ‌స్థ‌ను స్థాపించా రు. తొలినాళ్ల‌లో ఏరో స్పేస్ టెక్నాల‌జీ సంస్థ‌గా ప్రారంభమైన ఈ సంస్థ‌.. త‌ర్వాత‌.. ఇంటింటికీ ప‌రిచ‌య మైంది. చిత్రం ఏంటంటే.. ఇప్ప‌టికీ ప్ర‌భుత్వాల నుంచి బ్యాంకుల వ‌ర‌కు 'భ‌ద్ర‌త' విష‌యంలో న‌మ్మే సంస్థ గోద్రెజ్‌. ఈ సంస్థ రూపొందించిన తాళాల‌కు పెద్ద పేరు. ఇప్ప‌టికీ బ్యాంకులు గోద్రేజ్ వారి సేఫ్ లాక‌ర్ల‌నే వినియోగిస్తాయి.

Read more!

ఇక‌, ఇంట్లో వాడుకునే ఫ్రిజ్లులు, కూల‌ర్లు, ఏసీల నుంచి స‌బ్బుల వ‌ర‌కు కూడా.. గోద్రేజ్ భార‌త ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోయింది. వార్షికంగా.. ఈ సంస్త‌కు వ‌స్తున్న ఆదాయం.. 33 వేల కోట్లు. (అన్ని ప‌న్నులు పోగా) ఇక‌, అనేక రూపాలు సంత‌రించుకున్న ఈ కంపెనీకి త‌దుప‌రి వార‌సులుగా.. పిరోజ్‌షా పిల్ల‌లు వ‌చ్చారు. వీరు కూడా కంపెనీని ప‌రుగులు పెట్టించారు. ప్ర‌స్తుత మార్కెట్ పోటీని త‌ట్టుకునేలా నిరంత‌రం మార్పులు చేసుకుంటూ.. వినియోగ‌దారుల‌ను కాపాడుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ అన్న‌ద‌మ్ముల పిల్ల‌లు విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో 127 సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న గోద్రెజ్ కంపెనీని పంచుకున్నారు.

పంపకం ఇదీ..

గోద్రెజ్‌కు ప్ర‌ధానంగా.. రెండు ర‌కాల విభాగాలు ఉన్నాయి. 1) లిస్టెడ్‌(స్టాక్స్‌లో) కంపెనీలుగా 5 ఉన్నాయి. 2) అన్ లిస్టెట్ కంపెనీలు ఉన్నాయి. ఇక‌, ఇవి కాకుండా.. ముంబై, ఇత‌ర దేశాల్లోనూ.. ఆస్తులు, భూములు ఉన్నాయి. వీటిని వార‌సులు పంచుకున్నారు.

+ అర్దేషిర్‌కు పిల్ల‌లు లేరు. దీంతో పిరోజ్‌షా కు పిల్ల‌లు ఉన్నా.. ఆయ‌న‌కు న‌లుగురు ఆడ‌పిల్ల‌లే. దీంతో త‌ర్వాత కాలంలో ఈ పిల్ల‌ల‌కు జ‌న్మించిన వారే వార‌సులుగా వ‌చ్చారు. ఇప్పుడు వారే ఆస్తుల‌ను , వ్యాపారాల‌ను పంచుకున్నారు. వారిలో ఆది, నాదిర్ గోద్రేజ్‌లు..ఐదు లిస్టెడ్‌ కంపెనీలు ఉన్న గోద్రెజ్ ఇండస్ట్రీస్‌ను తీసుకున్నారు.

4

+ జంషీద్‌, స్మిత‌(కుమార్తె)లు.. అన్‌లిస్టెడ్ గోద్రెజ్, బోయ్స్, దాని అనుబంధ సంస్థలను తీసుకున్నారు. వీరిలోనూ జంషీద్‌.. ఏరోస్పేస్, ఏవియేషన్‌లో రక్షణ, ఫర్నిచర్, ఐటీ సాఫ్ట్‌వేర్‌లలో విస్తరించిన గోద్రెజ్ & బోయ్స్ సంస్థ‌ల‌కు చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటారు.

+ స్మిత త‌ర‌ఫున ఆమె కుమార్తె నైరికా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటారు. ముంబైలోని 3,400 ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌తో సహా ల్యాండ్ బ్యాంక్‌ను వీరు సమానంగా ప‌ర్య‌వేక్షించ‌నున్నారు.

+ ఆస్తుల విష‌యానికి వ‌స్తే.. ముంబైలోని అత్యంత విలువైన స్థిరాస్తులు, వ్య‌వ‌సాయ‌ భూములను స‌మానంగా పంచుకున్నారు.

Tags:    

Similar News