బాబు గడ్కరీ : ఒకరిని ఒకరు అలా !
ఈ సభలో ఆసక్తిని కలిగించే విషయం ఏంటి అంటే చంద్రబాబు మీద గడ్కరీ చాలా ప్రశంసలు కురిపించడం. బాబు వంటి నాయకులు దేశంలోనే అరుదు అని గడ్కరీ కితాబు ఇచ్చారు.;
గుంటూరు జిల్లా మంగళగిరిలో అతి పెద్ద కార్యక్రమం జరిగింది. ఏపీలో ఏకంగా 5 వేల 233 కోట్ల రూపాయలు విలువ చేసే జాతీయ రహదారుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కేంద్ర మంత్రి గడ్కరీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభ చాలా నిండుతనంతో కనిపించింది. గడ్కరీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్, సోము వీర్రాజు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఇలా అంతా హాజరయ్యారు
బాబు మీద గడ్కరీ కామెంట్స్ :
ఈ సభలో ఆసక్తిని కలిగించే విషయం ఏంటి అంటే చంద్రబాబు మీద గడ్కరీ చాలా ప్రశంసలు కురిపించడం. బాబు వంటి నాయకులు దేశంలోనే అరుదు అని గడ్కరీ కితాబు ఇచ్చారు. బాబు విజనరీ అన్నారు బాబు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆయనకు ఎంతో ముందు చూపు ఉంది అని కూడా మెచ్చుకున్నారు. బాబు వంటి నాయకుడి నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పరంగా ముందూ సాగుతోందని గడ్కరీ అన్నారు
గడ్కరీ గ్రేట్ :
ఇక చంద్రబాబు తన ప్రసంగంలో గడ్కరీని పొగిడారు. గడ్కరీ ఏపీకి ఎంతో చేశారు అన్నారు. ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నపుడు పోలవరానికి చేసిన ఉపకారం మరచిపోలేమని అన్నారు. ఇక ఏపీకి ఎన్నో రోడ్లు ఆయన ఇచ్చారని దేశంలో అనేక రోడ్లు సకాలంలో పూర్తి కావడానికి కూడా గడ్కరీ సమర్ధత కారణం అన్నారు. ఇలా బాబు సైతం గడ్కరీని ఆకాశానికి ఎత్తేశారు.
గడ్కరీతో బాబు బంధం :
బీజేపీలో చంద్రబాబుకు దోస్తులు చాలా మంది ఉన్నారు. గతంలో అయితే వాజ్ పేయ్ ఎల్ కే అద్వానీ బాబుని మెచ్చుకునేవారు. ఆ తరువాత చూస్తే రాజ్ నాథ్ సింగ్ గడ్కరీ వంటి నేతలతో బాబుకు మంచి సాన్నిహిత్యమే ఉంది ఇక మోడీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత బాబు ఆయనతోనూ బాగానే చెలిమి చేస్తూ వస్తున్నారు. అలాగే అమిత్ షాతోనూ బాబు తన స్నేహాన్ని చాటుకుంటూ వస్తున్నారు అయితే మొదటి నుంచి మాత్రం గడ్కరీ వంటి నేతలతో బాబు బంధం ప్రత్యేకంగా ఉంటూ వస్తోంది. ఒక విధంగా వీరంతా సమకాలీన రాజకీయ నాయకులు కావడం విశేషంగా ఉంది. అందుకే స్నేహాలు కలిశాయని అనుకోవాలేమో.
చాన్స్ ఆయనకు వస్తుందా :
ఇక దేశంలో చూస్తే మోడీ హవా సాగుతోంది. బీజేపీలో ఆయన మాటకు తిరుగులేకుండా పోతోంది. ఈ క్రమంలో 75 ఏళ్ళకు తప్పుకోవాలని ఆర్ ఎస్ ఎస్ మాటలు నాకూ మంచి రోజులు వస్తాయని గడ్కరీ ఈ మధ్యనే ఇస్తున్న ప్రకటనలు ఇవన్నీ చూసినపుడు బాబు గడ్కరీ పరస్పర పొగడ్తలు మీద సైతం చర్చ సాగుతోంది ఏది ఏమైనా బీజేపీ మొత్తం నాయకులతో బాబుకు మంచి రిలేషన్స్ ఉండడం ఆయన రాజకీయ చాతుర్యానికి నిదర్శనం అని అంటారు అంతా.