ఇది విన్నారా.. మెలోని సిగరెట్ మానేసిందట.. జీ7లో ఇదే హాట్ టాపిక్

ప్రపంచాన్ని కుదిపేస్తున్న యుద్ధాలు..అల్లకల్లోల ఆర్థిక పరిస్థితులు, వాతావరణ మార్పులు... ఇలాంటి గంభీరమైన విషయాల గురించి చర్చించి.. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి జీ7 దేశాధినేతలు కెనడాలో భేటీ అయ్యారు.

Update: 2026-06-17 06:05 GMT

ప్రపంచాన్ని కుదిపేస్తున్న యుద్ధాలు..అల్లకల్లోల ఆర్థిక పరిస్థితులు, వాతావరణ మార్పులు... ఇలాంటి గంభీరమైన విషయాల గురించి చర్చించి.. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి జీ7 దేశాధినేతలు కెనడాలో భేటీ అయ్యారు. కానీ అక్కడ జరిగిన అసలు చర్చ ఏంటో తెలుసా? మన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని గారి పర్సనల్ హెల్త్ అప్‌డేట్.. అవును మీరు విన్నది నిజమే. ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే సదస్సు కాస్తా 'స్మోకింగ్ మానేయడం ఎలా?' అనే హెల్త్ క్లినిక్‌లా మారిపోయింది.

పొగ రాని చోట.. ముచ్చట ఎలా వచ్చింది?

సమావేశం మధ్యలో బ్రేక్ దొరికిందే తడవుగా నాయకులంతా సీరియస్ లుక్స్ పక్కనపెట్టి చిట్ చాట్ మొదలుపెట్టారు. అప్పుడే మన మెలోని గారు ఒక బాంబు పేల్చారు. "నేను సుమారు నెల రోజుల క్రితమే స్మోకింగ్ పూర్తిగా మానేశాను" అని ఆమె ప్రకటించగానే అక్కడ ఉన్న మిగతా ప్రపంచ నేతల ముఖాల్లో ఆనందం చూడాలి.. ఏదో జీ7 దేశాలన్నీ కలిసి ప్రపంచ పేదరికాన్ని నిర్మూలించినంత రేంజ్‌లో ఆమెను అభినందించడం మొదలుపెట్టారు. ప్రపంచ సమస్యల కంటే పక్కనున్న లీడర్ సిగరెట్ మానేయడమే ముఖ్యం బిగువూ..

"నేను కూడా" అంటూ ఎంట్రీ ఇచ్చిన సీనియర్లు

మెలోని గారు తన స్మోకింగ్ పురాణం చెప్పగానే.. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఊరుకుంటారా? "నేను 2005లోనే ధూమపానం మానేశాను తెలుసా" అంటూ తన పాత డైరీ ఓపెన్ చేశారు. అంతటితో ఆగకుండా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వైపు తిరిగి సిగరెట్ అలవాటు నుంచి బయటపడటం ఎంత ముఖ్యమో క్లాస్ పీకడం మొదలుపెట్టారు. పాపం స్టార్మర్ గారు 'మేము ఇక్కడికి వచ్చింది జీ7 సదస్సుకా లేక డీ-అడిక్షన్ సెంటర్ కౌన్సిలింగ్‌కా?' అని లోలోపల అనుకుని ఉంటారనడంలో సందేహం లేదు.

సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల హడావుడి

ఈ ముచ్చట్లకు సంబంధించిన వీడియో కాస్తా బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. "అబ్బా.. ప్రపంచాన్ని శాసించే నాయకులు కూడా మనలాగే సాధారణ మనుషులా" అని కొందరు ఆశ్చర్యపోతుంటే.. "సిగరెట్ మానేయాలనుకునే వారికి మెలోని గారు పెద్ద ఇన్స్పిరేషన్" అంటూ మరికొందరు భజన మొదలుపెట్టారు. యుద్ధాలు, వాణిజ్య ఒప్పందాల కంటే ఈ 'పొగ ముచ్చట' కేవలం కొన్ని గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయిపోయింది.

ఏది ఏమైనా ప్రపంచ నాయకుల్లోని 'మానవీయ కోణం' బయటపడటం మంచిదే. రేపు పొద్దున జీ7 సదస్సు అజెండాలో "ఎవరు ఏ బ్రాండ్ టీ తాగుతున్నారు?" "డైట్ ప్లాన్స్ ఏంటి?" అనే అంశాలు చేర్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయాల సంగతి పక్కన పెడితే మెలోని గారు స్మోకింగ్ మానేసి మంచి నిర్ణయమే తీసుకున్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న మిగతా సమస్యల 'పొగ'ను కూడా కాస్త చల్లార్చితే బాగుంటుందని నెటిజన్లు ఆశిస్తున్నారు.


Full View


Tags:    

Similar News