• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉచిత బస్సు ఎక్కడ హిట్టు.....

ఉచిత బస్సు ఎక్కడ హిట్టు.. ఎక్కడ తుస్సు

| జూన్ 12న చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ మొదలైంది.

By - Tupaki Desk
Update: 2024-12-22 14:30 GMT

ఏపీలో ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలులో ఉన్న రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ముగ్గురు రాష్ట్ర మంత్రులతో కమిటీ వేసింది. ఇంతకుముందే ఈ పథకం అమలు చేస్తున్న కర్ణాటక, తెలంగాణల్లో ఏపీ ఆర్టీసీ అధికారులు పర్యటించి లోటుపాట్లు తెలుసుకున్నారు. అయినప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం మంత్రులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించింది.

జూన్ 12న చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ మొదలైంది. అప్పటికి ఆర్నెల్ల ముందు తెలంగాణలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరిన రెండు రోజుల్లోనే ఉచిత బస్సు హామీని నెరవేర్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ స్కీం ప్రవేశపెడుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇలా చూస్తుండగానే ఆర్నెల్లు పూర్తవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. సంక్రాంతికైనా ఉచిత బస్సు పథకాన్ని నెరవేర్చాలని మహిళల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయితే కర్ణాటక, తెలంగాణల్లో ఈ పథకంపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నాదనే వార్తల నడుమ చంద్రబాబు ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.

అయితే దేశంలో మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం అమలు అవుతోంది. తొలుత ఈ పథకాన్ని దేశ రాజధానిలో ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2019లో ఆప్ ప్రభుత్వం ఈ విప్లవాత్మక పథకాన్ని ప్రవేశపెట్టింది. డీటీసీ, క్లస్టర్, మెట్రో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఢిల్లీ ప్రభుత్వం చాలా సరళమైన నిబంధనలను అమలు చేస్తోంది. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా ఢిల్లీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. అదేసమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా పింక్ కార్డు తీసుకోవాలి. లేనిపక్షంలో తనిఖీ సమయంలో జరిమానా విధించొచ్చు. ఇలా ఢిల్లీ ప్రభుత్వం తరువాత తమిళనాడులో స్టాలిన్ సర్కార్ 2021లో ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ రెండు రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఉచిత బస్సు పథకానికి మహిళల నుంచి మంచి ఆదరణ లభించింది. మహిళా ఉద్యోగుల సంఖ్య, వారిలో పని సామర్థ్యం పెరిగిందని పలు సర్వేలు తెలిపాయి. ఇక 2023లో కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఉచిత బస్సు పథకంపై హామీనిచ్చి అమలు చేస్తోంది. ఈ రెండు రాష్ట్రాలకన్నా ముందు పంజాబ్ లో గెలిచిన ఆప్ ఢిల్లీలో వలే పంజాబ్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ విధంగా దేశంలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న ఐదు రాష్ట్రాలు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలే కావడం గమనార్హం. మరోవైపు ఏపీలో ఈ పథకం అమలు అయితే బీజేపీ భాగస్వామిగా ఉన్న తొలి ప్రభుత్వంగా రికార్డు సాధించనుంది.

ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో సత్ఫలితాలిచ్చిన ఉచిత బస్సు పథకంపై కర్ణాటక, తెలంగాణల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కర్ణాటకలో కొందరు మహిళా ప్రయాణికులు తీర్థ యాత్రల కోసం బస్సులు సప్లై చేయమని కోరడం మొదట్లో చర్చకు దారితీసింది. అదేవిధంగా తెలంగాణలోనూ ఉచిత బస్సు అమలు అవుతుండటంతో అనావసర ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. హైదరాబాద్ సిటీలో బస్సుల్లో రద్దీ మూలంగా ప్రభుత్వంపై అసంతృప్తికి కారణమవుతోంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత మేలైన మార్గాన్ని అన్వేషించాలని ఏపీ ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది.

Tags:    
  • Freebus 
  • Freebusstates 
  • Andhrapradesh 
  • Telangana 
  • Delhi 
  • Punjab 
  • Karnataka 
  • Tamilnadu 
  • Freebuseffects 
  • Congress 
  • Woman 
  • Stategovernement 

Similar News

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

Copyright @2026

Powered by Blink CMS