ఇండియన్స్ అమెరికాలో ఇళ్లు కొనడం మానేశారా? మొత్తం యూఎస్ మార్కెట్ కొలాప్స్!

అమెరికా అంతర్జాతీయ సంబంధాలపై తీసుకుంటున్న శైలితో, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల నమ్మకం తగ్గిపోతోంది.;

Update: 2025-07-24 17:34 GMT

ఒకప్పుడు అమెరికాలో ఇళ్లు కొనడానికి ఎగబడిన భారతీయులు, చైనీయులు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నట్లుగా స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం అమెరికాలో గత కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న ఆర్థిక అస్థిరత, అధ్యక్షుడు ట్రంప్ పాలసీల ప్రభావం అని నిపుణులు చెబుతున్నారు.

ట్రంప్ తిరిగి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన తర్వాత ఆయన తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద పాలసీలు అంతర్జాతీయ స్థాయిలో అనేక వ్యాపార రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా టారిఫ్ విధానాలు, విదేశీ పెట్టుబడులపై నియంత్రణలు, ఇమ్మిగ్రేషన్ పైన గట్టి ఆంక్షలు ఇవన్నీ కలసి అమెరికాలో పెట్టుబడుల వృద్ధిని అడ్డుకుంటున్నాయి.

ఇండియన్లు – చైనీయులు వెనక్కి తగ్గుతున్నారా?

ఇప్పటివరకూ అమెరికాలో ఎక్కువగా ఇళ్లు కొనేవారు స్థానికుల కంటే ఇండియా, చైనా వంటి దేశాల నుండి వెళ్లిన వలసదారులే. గ్రీన్ కార్డ్ దశలో ఉండేవారు, హైస్కిల్డ్ వర్కర్లు, బిజినెస్ వలసదారులు.. వీరందరూ నివాస స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టేవారు. కానీ ఇప్పుడు అదే సమూహం అమెరికాలో ఇళ్లు కొనడం తగ్గిస్తున్నారని అక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలు వెల్లడిస్తున్నాయి.

మార్కెట్ పడిపోయిన పరిస్థితి

ఇళ్ల కొనుగోళ్ల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా మందగించింది. నివాసాల అమ్మకాల వృద్ధిరేటు నెమ్మదించడమే కాదు, కొన్నిచోట్ల ఇళ్ల ధరలు కూడా తక్కువయ్యాయి. దాంతో నిర్మాణ రంగం, రియల్టీ బిజినెస్ కూడా నష్టాల్లోకి జారిపోతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల వాతావరణం

అమెరికా అంతర్జాతీయ సంబంధాలపై తీసుకుంటున్న శైలితో, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల నమ్మకం తగ్గిపోతోంది. అమెరికాలో పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇండియన్స్ మాత్రమే కాదు, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల నుంచీ వచ్చే ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా పడిపోయింది.

ఈ పరిస్థితికి ట్రంప్ పాలసీల వల్ల పెట్టుబడులపై అనిశ్చితి కారణం.. దీంతోపాటు.. అధిక వడ్డీ రేట్లు.. హోమ్ లోన్ దొరకడం కష్టంగా మారింది. ఇమ్మిగ్రేషన్ పై గట్టి ఆంక్షలు.. భవిష్యత్తుపై సందేహం..గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్ కారణంగా కనిపిస్తోంది.

ఈ విధంగా చూస్తే అమెరికాలో రియల్ ఎస్టేట్ బూమ్‌కి బ్రేక్ పడినట్టే. ట్రంప్ పాలసీల ప్రభావం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిరాశావాదం కలగలిపి అమెరికాలో ఇళ్ల మార్కెట్ కుదేలయ్యింది. ఇక ఇలాంటి పరిణామాలు కొనసాగితే, అమెరికా వలసదారులకు ఆకర్షణ కేంద్రంగా మిగిలే అవకాశం తగ్గిపోవచ్చు.

ఇతర దేశాల్లో కూడా ఇదే ప్రభావం కాస్త చూసే అవకాశముంది. ‘ట్రంప్ ఎఫెక్ట్’ ఇప్పుడు ప్రపంచ రియల్టీ రంగాన్ని ముంచేస్తున్నది.

Tags:    

Similar News