ఫోర్బ్స్ ఇండియా కుబేరుల జాబితాలో తెలుగువారు వీరే..!
ఈ ఫోర్బ్స్ ఇండియా కుబేరుల జాబితాలో ఆరుగురు తెలుగు వారు టాప్ 100 లో స్థానం దక్కించుకున్నారు.;
భారతదేశంలోని అత్యంత ధనవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాను.. ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో గత ఏడాదితో పోలిస్తే పలువురి సంపద క్షీణించిందని నివేదించింది. అయినప్పటికీ వారి వారి స్థానాల్లో పెద్దగా మార్పులు రాలేదు. ఈ సమయంలో ముకేష్ అంబానీ తన అగ్రస్థానాన్ని నిలుపుకుంటూనే ఉన్నారు.
అవును... భారతదేశంలోని టాప్ 100 కుబేరుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిది. ఇందులో భాగంగా... రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన నికర విలువ 105 బిలియన్లుగా ఉంది. వాస్తవానికి గత ఏడాదితో పోలిస్తే ఆయన సంపద 12 శాతం క్షీణించింది. అయినప్పటికీ ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు.
ఇక మౌలిక సదుపాయాల దిగ్గజం గౌతమ్ అదానీ & కుటుంబం 92 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఇక ఈ జాబితాలో మూడో స్థానంలో ఓపీ జిందాల్ గ్రూపుకు చెందిన సావిత్రి జిందాల్ నిలిచారు. ఆమె నికర విలువ 40.2 బిలియన్ డాలర్లు కాగా.. ఇది గత ఏడాదితో పోలిస్తే 3.5 బిలియన్లు తక్కువ!
జాబితాలో తెలుగువారు వీరే!:
ఈ ఫోర్బ్స్ ఇండియా కుబేరుల జాబితాలో ఆరుగురు తెలుగు వారు టాప్ 100 లో స్థానం దక్కించుకున్నారు. వీరిలో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి & ఫ్యామిలీ 25వ స్థానంలో నిలిచారు. వీరి నికర విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉంది. మెగా ఇంజినీరింగ్ చీఫ్స్ పీపీ రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి 70వ స్థానంలో నిలిచారు. వీరి నికర విలువ రూ.4.22 బిలియన్ డాలర్లు.
ఆ తర్వాత 3.75 బిలియన్ డాలర్ల నికర విలువతో 83వ స్థానంలో జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు నిలిచారు. ఆ తర్వాత 3.65 బిలియన్ డాలర్ల నికర విలువతో అపోలో హాస్పటల్ ఫౌండర్ ప్రతాప్ రెడ్డి 86వ స్థానంలో నిలిచారు. ఇదే క్రమంలో.. 3.5 బిలియన్ డాలర్ల నికర విలువతో హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారధి 89వ స్థానంలో నిలవగా... 3.45 బిలియన్ డాలర్లతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అధినేత సతీష్ రెడ్డి & ఫ్యామిలీ 91వ స్థానంలో ఉన్నారు.
దేశం మొత్తమ్మీద టాప్ 10 కుబేరులు వీరే!:
1. ముకేశ్ అంబానీ - 105 బిలియన్ డాలర్లు
2. గౌతమ్ అదానీ & కుటుంబం - 92 బిలియన్ డాలర్లు
3. సావిత్రి జిందాల్ - 40.2 బిలియన్ డాలర్లు
4. సునీల్ మిట్టల్ & కుటుంబం - 34.2 బిలియన్ డాలర్లు
5. శివ్ నాడర్ - 33.2 బిలియన్ డాలర్లు
6. రాధాకిషన్ దమానీ & కుటుంబం - 28.2 బిలియన్ డాలర్లు
7. దిలీప్ షాంఘ్వీ - 26.3 బిలియన్ డాలర్లు
8. బజాజ్ కుటుంబం - 21.8 బిలియన్ డాలర్లు
9. సైరస్ పూనవల్లా - 21.4 బిలియన్ డాలర్లు
10. కుమార్ మంగళం బిర్లా - 20.7 బిలియన్ డాలర్లు