మొన్న ముగ్గురు, ఇప్పుడు ఐదుగురు.. వరుసగా భారతీయుల కిడ్నాప్ వెనుక..!
ఈ ఏడాది జూలైలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ అవ్వగా.. తాజాగా ఐదుగురు ఇండియన్స్ కిడ్నాప్ అయినట్లు భద్రతా వర్గాలు, కంపెనీ ప్రతినిధులు తెలిపారు.;
పలు విదేశాల్లో ఉంటున్న భారతీయులు వివిధ రకాల దాడులకు గురవుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ.. పశ్చిమాఫ్రికా దేశం మాలీలో మాత్రం భారతీయులు వరుసగా కిడ్నాప్ లకు గురవుతున్నారు. ఇందులో భాగంగా... ఈ ఏడాది జూలైలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ అవ్వగా.. తాజాగా ఐదుగురు ఇండియన్స్ కిడ్నాప్ అయినట్లు భద్రతా వర్గాలు, కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
అవును... మాలీలో ఇటీవల ముగ్గురు భారతీయులు కిడ్నాప్ అయిన ఘటన తీవ్ర కలకలం రేపిన వేళ తాజాగా మరో ఐదుగురు ఇండియన్స్ కిడ్నాప్ అయినట్లు కంపెనీ ప్రతినిధులు, భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా... పశ్చిమ మాలిలోని కోబ్రీ సమీపంలో కార్మికులను ముష్కరులు కిడ్నాప్ చేశారని.. వారంతా విద్యుదీకరణ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సందర్భంగా స్పందించిన కంపెనీ ప్రతినిధి ఒకరు.. ఐదుగురు భారతీయులు కిడ్నాప్ అయినట్లు తాము ధృవీకరిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో... కంపెనీ పనిచేస్తున్న ఇతర భారతీయులను రాజధాని బమాకోకు తరలించినట్లు పేర్కొన్నారు. అయితే.. బాధితుల వివరాలు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు.. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ముఠా ఇంకా ప్రకటించలేదు.
అశాంతిని అరికట్టడానికి కష్టపడుతోన్న సైనిక జుంటా పాలన!:
ప్రస్తుతం సైనిక జుంటా పాలనలో ఉన్న మాలి.. అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధం ఉన్న క్రిమినల్ గ్రూపులతో పెరుగుతున్న అశాంతిని అరికట్టడానికి చాలా కష్టపడుతోంది. అల్-ఖైదాతో సంబంధం ఉన్న గ్రూప్ ఫర్ ది సపోర్ట్ ఆఫ్ ఇస్లాం అండ్ ముస్లింస్.. ఈ పేద దేశంలో భద్రతా పరిస్థితి ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.
సర్వసాధారణంగా విదేశీయుల కిడ్నాప్స్!:
2012 నుండి తిరుగుబాట్లు, ఘర్షణలతో సతమతమవుతున్న దేశంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ లు సర్వసాధారణంగా మారాయి. ఇందులో భాగంగా... జూలై నెలలో ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేశారు. ఇదే సమయంలో.. సెప్టెంబర్ నెలలో ఇద్దరు ఎమిరాటీ జాతీయులతో పాటు ఒక ఇరానియన్ ను జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్ ముస్లిమిన్ గ్యాంగ్ కిడ్నాప్ చేశారు! కొంత డబ్బు చెల్లించిన అనంతరం వారు విడుదల అయినట్లు తెలుస్తోంది.