ఏపీ రాజకీయాల్లో లేడీ సింగాలు.. ప్లస్సా.. మైనస్సా.. !
రాజకీయాల్లో ఫైర్ ఉండాల్సిందే. నాయకులు ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకోవాల్సిందే. ఇది ఇప్పుడే కాదు.. కొన్నాళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నదే.;
రాజకీయాల్లో ఫైర్ ఉండాల్సిందే. నాయకులు ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకోవాల్సిందే. ఇది ఇప్పుడే కాదు.. కొన్నాళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నదే. అయితే.. ఈ ఫైర్ వ్యక్తిగతంగా నాయకులకు, పార్టీలకు మేలు చేస్తే.. మంచిదే. కానీ.. తేడా వస్తే మాత్రం ఇబ్బందే. ఫైర్ బ్రాండ్ రాజకీయాలు నమ్ముకుని.. ఒకరిద్దరు మాత్రమే రాజకీయాల్లో పైకి వచ్చిన ఉదంతాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు నన్నపనేని రాజకుమారి. ప్రస్తుత రాజకీయంగా ఆమె కనిపించకపోయినా.. టీడీపీ తరఫున బలమైన గళం వినిపించారు.
అయితే.. ఎక్కడా వివాదాలకు దారితీయకుండా నన్నపనేని వ్యవహరించారు. దీంతో ఆమె దూకుడు రాజ కీయం పార్టీకి, వ్యక్తిగతంగా ఆమెకు కూడా మేలు చేసింది. ఇక, వైసీపీ నాయకుల విషయానికి వస్తే.. ఫైర్ బ్రాండ్ లేడీ నాయకుల్లో ఆర్కే రోజా ముందుంటారు. కానీ, ఆమెకు మిశ్రమ ఫలితాన్ని మాత్రమే ఈ తరహా రాజకీయాలు కట్టబెట్టాయి. సొంత పార్టీలోనే ఆమెతో విభేదించిన వారు ఉన్నారు. సో.. ఫైర్ బ్రాండ్ రాజకీయాలు చేయాలని ఉన్నా.. చేసినా కూడా.. వాటి వల్ల నష్టం లేకుండా రాకుండా చూసుకోవాలి.
ప్రస్తుతం టీడీపీలో ఇదే తరహా చర్చ సాగుతోంది. కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి ప్రతి విషయం పైనా ఫైరైపోతున్నారు. తన మన అనే తేడా లేకుండా.. ఆమె రెచ్చిపోతున్నారు. అధికారుల నుంచి నాయ కుల వరకు తీవ్రస్థాయిలో ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, వైసీపీ నాయకులకు అయితే.. కంటిపై కును కు లేకుండా చేస్తున్నారు. కానీ.. దీనివల్ల మాధవి సంపాయించుకున్న ప్లస్సుల కంటే మైనస్సులే ఎక్కు వగా కనిపిస్తున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి ఆమె ఒకసారి పునరాలోచన చేసుకోవాలి.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యవహారం కూడా దాదాపు ఇలానే ఉంది. ఆమె కూడా ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్నారు. కానీ, ఇది పార్టీలో ఆమెను నాయకులకు దూరంగా ఉంచుతోంది. అంతేకాదు.. సమ స్యలు చెప్పుకొనేందుకు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గుతోంది. ప్రత్యర్థి పక్షంవైపు ప్రజలు మొగ్గు చూపుతు న్నారు. దీనికి కారణం.. ప్రతి దానికీ చిర్రుబుర్రులు ఆడడమే. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఆమె మరోసారి విజయం దక్కించుకోవాలంటే.. ఒకింత తగ్గిఉండాల్సిందేనని అంటున్నారు సొంత నేతలు. సో.. లేడీ సింగాలుగా గుర్తింపు మంచిదే అయినా.. రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.